News and Entertainment

ఆదివారం సెలవు ఎందుకు వచ్చిందో తెలుసా..!!


ఇండియా లో ఆదివారం సెలవు రోజు అనే విషయం అందరికి తెలిసిందే! కానీ ఈ సెలవు ఎలా వచ్చిందో చాలామందికి కొద్దిమందికే తెలుసు. ఈ తరం పిల్లలకు అసలు తెలియక పోవచ్చు. దానికో చిన్న కథ ఉంది. ఈ ఆదివారం సెలవు అనేది ‘నారాయణ మేఘాజీ లోఖండే’ అనే మహానుభావుడి పుణ్యం. ఆమహా పురుషుడు బ్రిటిష్ వారితో పోరాడితే మనకు ఆదివారం సెలవు రోజుగా ప్రకటించారు. ఆ పోరాటం కూడా ఒకవారమో ,ఒక నెలోకాదు… సుమారు 8ఏళ్లు పోరాటం చేసాడు. నారాయణ మేఘాజీ జ్యోతిరావు పూలే గారి సత్యశోధన ఉద్యమంలో కార్యకర్త మాత్రమే కాకుండా కార్మిక నాయకుడు కూడా.

బ్రిటిష్ వారి హయాం లో వారానికి 7రోజులూ పనిచేసే వారు. నారాయణ మేఘాజీ వారం రోజులూ మన కుటుంబం కోసమే కష్టపడుతున్నామే గానీ ఏ సమాజం వలన మనకు నౌకరీ దొరికిందో ఆ సమాజ సమస్యలపై దృష్టి పెట్టేందుకు ఒకరోజు కావాలని అందుకు ఒకరోజు సెలవు కావాలనే ప్రస్తావన 1881 లో బ్రిటిష్ ప్రభుత్వం ముందు ఉంచాడు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఈ క్రమంలో నారాయణ మేఘాజీ ఉద్యమం మొదలు పెడితే అది తీవ్ర రూపం దాల్చి ఆఖరికి *బ్రిటిష్ ప్రభుత్వం దిగివచ్చి 1889 లో” ఆదివారం “సెలవు ప్రకటించింది.

సెలవు అయితే వచ్చింది కానీ మేఘాజీ ఆశయం నెరవేరలేదు. ఏ కొద్దిమందో తప్ప సామాజిక సమస్యలపై దృష్టి పెట్టడం లేదు. భారత్ దేశంలో కార్మిక ఉద్యమానికి ఆద్యుడు ఈయనే. కార్మికులకోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టాడు. ఇదిలా ఉంటే మేఘాజీ మహాత్మా జ్యోతిరావు పూలే కి సన్నిహితులు. దీనబంధు పత్రిక నిర్వహణ లో కొన్నాళ్ళు కీలక బాధ్యత లు నిర్వహించారు. 1897 లో ముంబాయి లో కన్నుమూసారు. భారతప్రభుత్వం నారాయణ్ మేఘాజీ జ్ఞాపకార్థం 2005 సం లో పోస్టల్ స్టాంప్ ని విడుదల చేసింది…
షేర్ చేయండి






loading...