News and Entertainment

బస్సులో సీటు లేదని యువతి పక్కన కూర్చోనిస్తే

బస్సులో యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై నిర్భయ చట్టం నమోదైంది. ఆదిలాబాద్‌కు చెందిన బీ.సంజీవ బుధవారం పంజాగుట్టలో సెట్విన్‌ బస్సు ఎక్కాడు. అక్కడే మరో యువతి బస్సు ఎక్కింది. మహిళలకు కేటాయించిన సీట్లలో ఆమె కూర్చోంది. బస్సులో మరెక్కడ కూర్చొనేందుకు సీట్లు లేక పోవడంతో సంజీవ కూడా యవతి పక్కనే కూర్చొన్నాడు.
సీటీలో ఇలాంటివి మామూలే కదా అనుకొని దానికి యువతి కూడా ఏమనలేదు. సదు ఉద్దేశంతో యువతి కూర్చొనిస్తే సంజీవ మాత్రం అసభ్యంగా
ప్రవర్తించడం మొదలుపెట్టాడు. వారించినా వినకపోవడంతో ఆ యువతి మిగతా ప్రయాణికులతో కలిసి సంజీవకు దేహశుద్ధి చేసింది. తరువాత బేగంపేట పోలీసులకు అప్పగించింది. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అందరికీ షేర్ చెయండి


loading...