News and Entertainment

ఆధార్ కార్డు ఉంటే.. యాపిల్ ఐఫోన్ 7 రూ.1700లకే.


ఇండియన్ మార్కెట్ లో ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ మొబైల్స్ విక్రయింపు అక్టోబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానుందని యాపిల్ సంస్థ ప్రకటించింది. యాపిల్ నుంచి వచ్చే ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌లను కొనుగోలు చేసేందుకు వీలుగా వినియోగదారులకు ఆధార్ కార్డులతో యాపిల్ సంస్థ లింకు పెట్టింది. ఎలాగంటే..? ఆధార్ కార్డు ఉన్నవారికి ఈజీ ఈఎమ్ఐ ద్వారా ఫోన్లు కొనుగోలు చేసుకోవచ్చునని యాపిల్ పేర్కొంది.

దీని ప్రకారం ఆధార్ కార్డును చూపెట్టి రూ.1700లను అడ్వాన్స్‌గా చెల్లిస్తే.. యాపిల్ ఐఫోన్7ను పొందవచ్చు. ఆధార్ కార్డు గల కస్టమర్లకు ఈఎమ్ఐ ద్వారా ఐఫోన్లను అందజేసేందుకు వీలుగా యాపిల్ సంస్థ పలు భారతీయ బ్యాంకులతో చర్చలు జరుపుతోంది. ఈఎంఐల ద్వారా కాకుండా యాపిల్ కొత్త ఐఫోన్లను కొనుగోలు చేసే వినియోగదారులు అడ్వాన్స్‌గా
రూ.5వేలను చెల్లించాల్సి వుంటుంది. ఈ ఫోన్లు రిలయన్స్ డిజిటల్, క్రోమా వంటి ఎలక్ట్రానిక్ షాపుల్లో లభ్యమవుతాయి. ఈ రెండు సంస్థలు ఐఫోన్ 7 కోసం అడ్వాన్స్ బుకింగ్ ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించాయి.

యాపిల్ ఐఫోన్ల విక్రయింపును బీటెల్ సంస్థ అక్టోబర్ 7వతేదీ, రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఇక యూనికాన్, ఐవరల్డ్ సంస్థలు అక్టోబర్ 7వ తేదీ 12 మధ్యాహ్నం 12 గంటల నుంచే ప్రారంభించనున్నాయి. భారత్‌లో కొత్త ఐఫోన్ ధరను ఇంకా సంస్థ ప్రకటించలేదు. అయితే దాదాపు భారత్‌లో ఐఫోన్ ధర రూ.60వేల నుంచి ఆరంభం కావొచ్చునని తెలుస్తోంది. 


loading...