News and Entertainment

పవన్‌ రికార్డుకు ఎసరు


కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్‌ హిట్‌ అయిన ‘అత్తారికింటి దారేది’ చిత్రం టాలీవుడ్‌ టాప్‌ 3 చిత్రంగా ఉన్న విషయం తెల్సిందే. మొదటి స్థానంలో ‘బాహుబలి’, రెండవ స్థానంలో ‘శ్రీమంతుడు’ ఉండగా మూడవ స్థానంలో ‘అత్తారింటికి దారేది’ చిత్రం ఉంది. అయితే తాజాగా ‘జనతా గ్యారేజ్‌’ జోరును చూస్తుంటే ఏకంగా మూడవ స్థానంకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 70 కోట్ల మార్క్‌ను క్రాస్‌ చేసిన జనతా అతి త్వరలోనే ‘అత్తారింటికి దారేది’ రికార్డును బద్దలు కొట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

100 కోట్ల టార్గెట్‌, నెం.2 స్థానం దక్కించుకోవాలనే పట్టుదలతో విడుదల అయిన జనతా గ్యారేజ్‌ మొదటి రోజు టాక్‌ను బట్టి కనీసం 50 కోట్లు అయినా వసూళ్లు చేయలేదేమో అనే అనుమానాలు కలిగాయి. అయితే కాలం కలిసి వచ్చి, అన్ని కూడా జనతాకు అనుకూలించి భారీ కలెక్షన్స్‌ను ఈ చిత్రం రాబట్టింది. ఈ వారాంతంతో కలిసి మొత్తంగా ఈ సినిమా 80 కోట్లకు పైగా వసూళ్లు చేస్తుందనే నమ్మకంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారు. ఇప్పటికే పలు మెగా రికార్డులను బ్రేక్‌ చేసిన ఎన్టీఆర్‌ అతి త్వరలోనే పవన్‌ నెం.3 రికార్డును కూడా బ్రేక్‌ చేయబోతున్నాడు. ఈ రికార్డుల బ్రేక్‌తో నందమూరి ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు.
షేర్ చేయండి