News and Entertainment

జియోతో జరభద్రం.. ఫ్రీ హోం డెలివరీ బాగానే వున్నా..ఇంకో పక్క హ్యాకర్ గ్రూప్ వార్నింగ్.. ఏమి జరుగుతుంది అసలు...??



జియో ఒక ప్రభంజనం అయిన విషయం తెలిసిందే, సిమ్ ల కోసం ఎంత మంది ప్రయత్నిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. రిలయన్స్ జియో కోసం రిలయన్స్ షాపుల వెంట బడుతున్నారా?
ఇక ఆ పని చేయాల్సిన పని లేదు. ఇంట్లో కూర్చునే జియో సిమ్ పొందవచ్చు. నిజమే అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి. ఆన్ లైన్లో జియో సిమ్ కోసం పొందే దిశగా త్వరలోనే రిలయన్స్ జియో ఒక ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించబోతోంది.

సిమ్ పొందడంలో వినియోగదారుల ఇబ్బందిని గుర్తించిన జియో యాజమాన్యం.. డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ పోర్టల్లో వినియోగదారులు వారి సమాచారాన్ని, చిరునామాను నమోదు చేస్తే వారం రోజుల్లోపే సిమ్ ఇంటికి వచ్చేస్తుంది. దీంతో కస్టమర్లు ఎగిరి గంతేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ముకేష్ అంబానీ గ్రూప్ వారి రిలయెన్స్ జియో సర్వీసులపట్ల జర భద్రంగా ఉండాలని ఓ హ్యాకర్ గ్రూప్ హెచ్చరిస్తోంది.


యూజర్లకు చౌకలో 4జీ డేటా, ఫ్రీ వాయిస్ కాల్స్ వంటి ఎన్నో తాయిలాలు ప్రకటించిన ఈ సర్వీసెస్ మీరనుకున్నంత భద్రం కాదని ఎనానిమస్ అనే ఈ హ్యాకర్ గ్రూప్ వార్నింగ్ ఇస్తోంది. జియో యూజర్ల కాల్ సమాచారాన్ని ఈ సంస్థ విదేశాలకు చేరవేస్తోందని తన టుంబ్లర్ ఖాతాలో పేర్కొంది. ఏది ఏమైనా మన జాగ్రత్త లో మనం ఉండడం మంచిది కదా...