News and Entertainment

శ్మశానంలో పాతి పెట్టారు.. కాని బయటకు వచ్చి స్నానం చేసాడు.. అలా ౩సార్లు


దేశంలో టెక్నాలజీ పరంగా మొదటి స్థానంలో దూసుకుపోతుంది కర్ణాటక రాష్ట్రం లోని బెంగుళూరు. కాని అదే కర్ణాటక లోని బళ్ళారి జిల్లాలో జరిగిన ఒక ఘటన మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కర్ణాటక ప్రభుత్వం మూడనమ్మకాలకు వ్యతిరేకంగా ఎంతగానో ప్రయత్నిస్తుంది. దాని కోసం టీవీలలో ప్రచారమయ్యే జాతకాల కార్యక్రమాలను నిలిపివేసే ప్రయత్నం లో ఉంది.

ఇది ఇలా ఉండగా కర్ణాటకలోని బళ్లారి జిల్లా... భీమసముద్ర గ్రామం.. అక్కడ ఓ వ్యక్తికి అంత్యక్రియలు చేస్తున్నారు. పాడెమీద పడుకోబెట్టి.. దండలు వేసి, శ్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ ఒక గొయ్యి తీసి అందులో అతడిని కప్పెట్టారు. గ్రామస్తులంతా ఏడ్చి, తర్వాత ఇళ్లకు తిరిగి వచ్చేశారు. కాసేపు గడిచిందో లేదో..

అతడు గొయ్యిలోంచి బయటకు వచ్చి, చెరువులో స్నానంచ ఏసి మళ్లీ ఇంటికెళ్లిపోయాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు రోజుల పాటు అలాగే చేశారు. ఇదంతా ఎందుకో తెలుసా.. ఆ గ్రామంలో వర్షాలు బాగా కురవాలని ఇదంతా చేస్తున్నారు
ఇలా బతికున్న మనిషికి అంత్యక్రియలు చేస్తే వర్షం పడుతుందన్నది వాళ్ల నమ్మకం. వర్షాలు కురవడం రెండు మూడు నెలలు ఆలస్యం అయితే తాము చర్చించుకుని, ఎవరో ఒకరిని శవంలా నటించడానికి ముందుకు రావాలని అడుగుతామని, వచ్చేవాళ్లు కూడా స్వచ్ఛందంగానే వస్తారు తప్ప బలవంతం ఏమీ ఉండబోదని ఆ ఊర్లో గ్రామ పెద్దలు అంటున్నారు.

loading...