News and Entertainment

కుజదోషం అపోహాలు-నిజాలు


అష్టమాధిపత్యం చేత కుజదోషం అన్న మాట వచ్చింది. అదేమంటారా? మేషం నుండి చూస్తేనే ఈ విషయం స్పష్టం అవుతుంది. అష్టమాధిపత్యం కుజునికి వస్తే ఏం చేస్తాడు. సంసార జీవితంలో నష్టాన్ని కలుగజేస్తాడని ఎందుకు అనుకుంటున్నారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు మనమే వెదకాలి.

ప్రాచీన గ్రంథాల్లో కుజుని లక్షణాలను గూర్చి ఒకసారి మనం పరిశీలిస్తే.
కుజుడు ఉగ్రస్వభావి. రక్త వర్ణం, అగ్ని తత్వ్తం కలిగినవాడని తెలుస్తుంది. అష్టమాధిపత్యం రావడం చేత ఆభావం పట్ల తీవ్ర పరిణామాలను ఇస్తాడని. ఏ లగ్నానికైనా అష్టమాధిపతి కష్టాలనే కలిగిస్తాడని ఒక వాదన ఉంది కాబట్టి, ఆ కోణంలో మనం చూడాలి. మేషాత్తు మనకు గ్రహ కారకత్త్వాలను నిర్ధారించడంతో ఈ కుజ దోషం కేవలం భార్యా భర్తలకు చేటు చేస్తుంది అనే వాదన బయటకు వచ్చింది. అయితే ఈ వాదన ఎంత బలమైందంటే కుజుడు ఏ లగ్న చక్రకంలోనైనా 1,2,4,7,8,12 స్థానాల్లో ఉంటే కుజదోషంగా చెప్పారు. పైగా విశేష దృష్టి ఫలితాల్లో కూడా 4,7,8 చెప్పబడ్డాయి. అంటే ఏ స్థానంలో ఉంటే అక్కడినుండి 4,7,8 స్థానాలను చూస్తాడని.
లగ్నం అనగానే తను స్థానం, ఆలోచన, శరీర సౌష్టవం, వంటివి చూడాలి.

ద్వితీయం అనగానే కుటుంబం, వాక్కు, ముఖ కవళికలు, ధనం, ఇలాంటివి చూస్తాం చతుర్థం : తల్లి, భూమి, వాహనం, గృహం, సర్వ సౌఖ్యస్థానం చూస్తాం సప్తమం : కళత్రం, సన్నిహితం, మౌదలైనవి అష్టమం : గుహ్యం, రహస్యం, మూలం, అంగం, గోప్యం, మనిషి చేసే అసాంఘిక కార్యకలాపాలు, వ్యసనాలు ఈ స్థానాల వల్ల తెలియబడే అంశాలకు కుజుడికి సంబంధాలు మనం విచారించాలి. ఇక్కడ సప్తమ, అష్టమ స్థానాలపై ఈ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుదనేది మనముందున్న ప్రశ్న. కుజుడు ఏ భావాధిపతి అయ్యాడో ముందు తెలుసుకుంటాం! అయితే ఏ లగ్న జాతకునికైనా ఏభావాధిపతి షష్ట,అష్టమ,వ్యయాధిపతితో కలస్తే ఆభావం చెడుతుంది అనేది మొదటగా మనం తెలుసుకోవాలి. లగ్నాత్తు అష్టమాధిపతి పాపై ఏ భావంలో ఉంటే ఆ భావం ఆ దశాంతర్దశల్లో ఎక్కువగా ఫలితాన్నిస్తుంది.

కర్కాటక లగ్నానికి, మీన లగ్నానికి, సింహ లగ్నానికి కుజుజు లగ్నాత్తు శుభుడైనప్పుడు కుజదోషం విచారణకు తీసుకోకూడదని కె.పి ఆస్ర్టాలజీలో రిఫరెన్స్ ఉంది. మేష, వృశ్చిక, కన్య లగ్నాలకు షష్ట, అష్టమాధిపత్యాల వల్ల కుజ ప్రభావం ఉంటుంది. లగ్నాధిపత్యంచేత శుభుడే అంటారు కాని షష్ట, అష్టమాధిపత్యాలు కచ్చితంగా కనబడతాయని గ్రహించాలి. సప్తమంగాని, అష్టమం గాని ద్విస్వభావరాశై, కుజుడు ఉంటే ఫలితాలు మరో రకంగా ఉంటాయి. ఇవి జ్యోతిష పండితుల ద్వారా తెలుసుకోవాలి. అంటే ద్విస్వభావ రాశులైన మిధున, కన్య, వృశ్చిక మీనాలకు కళత్ర, దాంపత్య సంబంధాల విషయంలో ఆచితూచి కుజు దోష నిర్థారణ చేయాలి. నాలుగింట కుజుడుంటే కుజదోషం అంటే అది నిజంకాదు.

ఈ అపోహలతో ఎంతోమంది మంచి సంబంధాలను వదిలేయడం జరుగుతుంది. అసలు పురుష, స్ర్తీ జాతకాలు విడివిడిగా చూసి ఎవరికి ఎటువంటి కళత్రం వస్తుంది. ఈ సంసార జీవితానికి అడ్డంకులు ఉన్నాయా? కుజుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు. అనేది తెలుసుకోవాలి. అంతే తప్ప కుజదోషం ఉందని భయపడేలా చేయకూడదు. ఒక వేళ కుజడు దుష్పలితాలిచ్చినా అది సంసార పరంగానే కాదు, కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, ఇతర అనేక కారణాల ద్వారా చెడ్డఫలితాలిస్తాడు. అందుకేనేమో 288 రకాల కుజదోషాలున్నయని కొందరు రాసుకొచ్చారు


loading...