News and Entertainment

మీడియాలో వస్తున్న రేప్ వార్తలు చూసి అక్కడ లాక్ చేసుకుంది.. తాళం పొగొట్టుకుంది


అమెరికాలోని టెక్సాస్ లో ఓ ఇరవై ఏళ్ళ అమ్మాయి వింత పరిస్థితి ఎదుర్కొంది. ఇటీవల టీవీల్లో అత్యాచార కథనాలు చూసి ఆందోళన చెందింది. మాన రక్షణ కోసం ఓ కవచాన్ని ధరించింది. అయితే దాని తాళం పొగొట్టుకుంది. గత్యంతరం లేక విముక్తి కోసం ఫైర్ ఫైటర్స్ను ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న సిబ్బంది మొదట కంగుతిన్నారు. 


దాన్ని ధరించాలని ఎవరైనా బలవంతం చేశారా అని అడిగితే తనను ఎవరూ బలవంతం చేయలేదని, తనపై ఎలాంటి లైంగిక దాడులు జరగలేదని, అయితే మీడియాలో వస్తున్న రేప్ వార్తలు చూసి భయాందోళన చెందినట్లు పేర్కొంది. జాగ్రత్త కోసమే.. మాన రక్షణ కవచాన్ని ధరిస్తున్నట్లు వివరించింది. ఆమె సమాధానంతో సంతృప్తి చెందిన ఫైర్ సిబ్బంది, ఆ రక్షణ కవచాన్ని పగులగొట్టారు. ఆ బాధ నుంచి ఆమెకు విముక్తి కలిగించారు.