News and Entertainment

శృంగారం వద్దన్నా వినిపించుకోలేదు.. ఇప్పుడు!


యవ్వనంలో ఉన్నప్పుడు కోర్కెలు గుర్రాలెక్కి మరీ స్వారీ చేస్తాయి. ఆ కోర్కెలను అదుపులో ఉంచుకోకుంటే జీవితం నాశనం కావడం గ్యారెంటీ అనే విషయం గతంలో పలు సార్లు రుజువు అయ్యింది. మళ్లీ కూడా మరోసారి శ్రీ లక్ష్మి రూపంలో రుజువు అయ్యింది. శ్రీలక్ష్మి ఇంజనీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతుంది. మూడవ సంవత్సరం నుండి సంతోష్‌తో స్నేహం. ఆ స్నేహంతో అతడికి అన్ని అర్పించేసింది. మొదటి నుండి కూడా అతడు కోర్కెలు తీర్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆమె వారిస్తూ ఉంది. శృంగారం వద్దు అంటూ ఎంత చెప్పినా వినిపించుకోకుండా అతడు బలవంతం చేశాడు. దాంతో ఒకానొక బలహీన సమయంలో అతడికి శ్రీలక్ష్మి లొంగి పోయింది.

దాదాపు మూడు నెలల పాటు విచ్చలవిడిగా ఇద్దరు కూడా శృంగారంలో పాల్గొన్నారు. మోజు తీరిన సంతోష్‌ ఆమెను దూరం పెట్టడం మొదు పెట్టాడు. సరిగా మాట్లాడక పోవడం, అవసరం తీరినట్లుగా మాట్లాడటం, కొత్త వారితో ఉన్నట్లుగా కాస్త అంటీ ముట్టనట్లుగా ఉండటం చేస్తున్నాడు. ఒక రోజు శ్రీలక్ష్మి తెగేసి అడిగింది. ఎందుకు ఇలా చేస్తున్నావు అని, అందుకు అతడు చెప్పిన సమాధానంతో శ్రీలక్ష్మికి మతిపోయినంత పని అయ్యింది. నీ క్లాస్‌మెంట్‌తో కలిసి తిరుగుతున్న విషయం నాకు తెలిసింది. అతడు ఉండగా నేను ఎందుకులే అంటూ పక్కకు తప్పుకున్నాన అన్నాడు. అతడితో అన్ని పంచుకుంటున్నట్లుగా తెలిసింది, ఇక నేను ఎందుకు నీకు నచ్చుతాను అంటూ వెళ్లి పోయాడు. అతడు మోసం చేసి, చివరకు నింద నామీదే వేసి వెళ్లాడు అని శ్రీలక్ష్మి సన్నిహితుల వద్ద చెప్పి బోరుమంది. ఈవిషయం ఆనోట ఈనోట పడి సోషల్‌ మీడియాకు ఎక్కింది.
షేర్ చేయండి




loading...