News and Entertainment

ఏమయ్యా ప్రధాని మోడీ… సిగ్గూశరం లేదా నీకు!?మోడీకి రకరకాల కొత్త పద్ధతుల్లో ప్రచారం చేసి పెట్టడంలో ఆయన వీరభక్తులు సిద్ధహస్తులు… ఫోటోల్లో తలలు మార్చి, సోషల్ మీడియాలోకి వదలడం దగ్గర్నుంచి ఫోటోషాపీ టక్కుటమారాలెన్నింటినో ప్రయోగిస్తారు… రకరకాల ప్రయోగాలూ చేస్తారు… తాజాగా మోడీ తమ్ముడి కూతురి మరణాన్నీ మోడీ ఇమేజ్ కోసం వాడేసుకుంటున్నారు… అదీ నీచం… అయితే అందులోనూ ఓ ప్రయోగం చేశారండోయ్…. దాన్ని తెలుగులో నిందాస్తుతి అంటారు… దేవుళ్లకు వాడతారు ఎక్కువగా… మరిప్పుడు మోడీ నయా దేవుడే కదా… అందుకని పైకి తిడుతున్నట్టు కనిపించినా…, దాని ఆంతర్యం, అర్థం, అంతర్వాహిని అంతా కీర్తనే… సరే… సోషల్ మీడియాలోకి వదిలిన ఈ ఎస్ఎంఎస్ లో అన్నీ నిజాలే ఉన్నాయి… కానీ ఒక మరణాన్ని ఇమేజీ బిల్డింగు కోసం వాడుకోవడం అనేదే అభ్యంతకరం… 
వర్తమాన రాజకీయాల్లో మోడీ ఓ విలక్షణ వ్యక్తి… అది నిజమే… భార్యను వదిలేసి, కుటుంబాన్ని దగ్గరకు రానివ్వకుండా, అప్పుడప్పుడూ తల్లి వద్దకు మాత్రం వెళ్లే ఈ సన్యాసి అసలు భారత రాజకీయ విలువలకే సరిపడని వ్యక్తి అనిపిస్తాడు… సరే, విషయమేందంటే మోడీ తమ్ముడు ప్రహ్లాద్ మోడీ కూతురు (అన్నట్టు నీస్ అంటే తెలుగులో ఏమని రాయాలో ఎవరైనా ఈనాడు మిత్రుడిని అడగాలి అర్జెంటుగా… ఇంగ్లిషులో అక్కాచెల్లెళ్ల పిల్లలు, అన్నాదమ్ముల పిల్లల్ని సింపుల్ గా నీస్ అనేస్తారు…)  నికుంజ్ బెహన్ 41 ఏళ్ల వయస్సులో గుండెపోటుతో చనిపోయిందట… ఆమె తన బతుకుదెరువు కోసం కుట్టుమిషన్ నడిపేది… ఇక ఆ మరణాన్ని తీసుకుని ఈ సందేశంలో ఇలా రెచ్చిపోయారు…
‘‘నిజంగా నీకు సిగ్గూశరం లేదా చెప్పు? ప్రధానిగా పెదనాన్న ఉన్న ఆమె కూడా ఓ సాదాసీదా పేద భారతీయురాలిగా మరణించడమేనా? నీ కుటుంబాన్ని నువ్వెప్పుడైనా పట్టించుకున్నావా? ఒక్కడినైనా రాజకీయాల్లోకి తెచ్చి, టికెట్లు ఇచ్చి, నాలుగు డబ్బులు సంపాదించుకునేట్టు చేశావా? ఏం మనిషివయ్యా నువ్వు? ఓ ప్రధాని కుటుంబం అలా సగటు మధ్యతరగతి బతుకులు బతకడం ఏమిటసలు? ఆ ములాయంసింగ్ యాదవ్ ను చూడు… ఒకప్పుడు రెండు పూటలకు తిండి లేని కుటుంబం ఇప్పుడు వేల కోట్లు సంపాదించింది… ఆయన కుటుంబానికి చెందిన దాదాపు 36 మంది రాష్ట్రాన్ని పాలిస్తున్నారు… అసలు వాళ్లదే రాజ్యం… 30 ఏళ్ల క్రితం మాయావతి కుటుంబం ఢిల్లీలో ఓ గదిలో బతికేది… ఇప్పుడు ఆమె తమ్ముడి భవంతి తాజ్ మహల్ ను మించి తళతళ మెరిసిపోతున్నది… మాజీ ప్రధాని దేవెగౌడ తన మనమడి కోసం ఏకంగా 100 కోట్ల సినిమాను తీసేస్తున్నాడు… సెకండ్ హ్యాండ్ సరుకులు అమ్ముకునే సోనియా అల్లుడు ఫైవ్ స్టార్ హోటళ్లు, ప్యాలెసులు, లగ్జరీ కార్లు, వందల కోట్లు… మరి నువ్వు…? మీ తల్లి ఆటోరిక్షాలో తిరుగుతుంది, అన్నాదమ్ముల పిల్లల్లో ఒకావిడ కుట్టుపనితో కడుపు నింపుకుంటుంది… మరొకామె ట్యూషన్లు చెప్పుకుంటుంది… నీ సొంత బావమరిది కూడా కిరాణాషాపు నడుపుకుంటాడు… అందుకే నీకు సిగ్గు లేదూ అనేది… నీ తమ్ముడికీ, అన్నకూ టికెట్లు ఇచ్చేసి ఎంపీలను చేసేయాల్సింది… అక్కకు, చెల్లెళ్లనూ రాజ్యసభకు తెచ్చేసుకోవాల్సింది… బావమరిదిని కనీసం జిల్లా ఎన్నికల్లోనైనా హీరోను చేయాల్సింది… ఏం కుటుంబమో ఏమో…’’
source:muchata
షేర్ చేయండిloading...