News and Entertainment

నాగదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమవుతున్న యువతులు దర్శించవలసిన ఆలయం ఏమిటి ?


1. నాగదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమవుతున్న యువతులు దర్శించవలసిన ఆలయం
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం మోపిదేవి. దక్షిణభారత దేశంలోని షణ్ముఖ దేవాలయాల సరసన ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రంగా విరాజిల్లుతోంది కృష్ణాజిల్లా మోపిదేవి కుమారక్షేత్రం. కుమారక్షేత్రమే సుబ్రహ్మణ్య క్షేత్రం.స్కాందపురాణంలోని సహ్యాద్రిఖండంలో కృష్ణానదీ మహాత్మ్యము, ప్రముఖ క్షేత్రమైన మోపిదేవి క్షేత్ర విశేషాలు.

2. స్థలపురాణం
అగస్త్యమహర్షి వింధ్య పర్వత గర్వాన్ని అణచడానికి తప్పని పరిస్థితుల్లో కాశీని విడిచిపెట్ట వలసి వచ్చింది.
వింధ్య పర్వతం అహంకారంతో విజృంభించి, ఆకాశంలో కి చొచ్చుకొని పోయి, సూర్య గమనాన్ని సైతం నిరోధించసాగింది. ప్రకృతి స్థంభించింది. గ్రహ సంచారాలు నిలిచిపో యాయి. ఈ మహోపద్రవాన్ని నివారించగలిగేది అగస్త్యమ హర్షి మాత్రమేనని భావించిన బ్రహ్మాది దేవతలు అగస్త్యమ హర్షికి, విషయాన్ని వివరించారు. యోగదృష్టితో సర్వము నెరింగిన మహర్షి తాను ఇప్పుడు కాశీని వీడితే కల్పాంత మైనా తిరిగి కాశీకి రావడానికి వీలు పడదని తెలిసి కూడా లోక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అమర కార్యానికి అంగీకరించాడు.

3. అగస్త్య లోపాముద్రల ప్రయాణం
లోపాముద్రా సహితుడై దక్షిణాపథానికి బయలుదేరాడు అగస్త్యమహర్షి.దారిలో నున్న వింధ్య పర్వ తం మహర్షి రాకను గమనించి సాష్టాంగపడి నమస్కరిం చింది.తాను మరలి వచ్చేవరకు అలాగే ఉండమని శాసించి, కాశీ విశాలాక్షీ, విశ్వనాథులను మనసులో నిలుపుకొని, దక్షిణాపథం వైపు బయలుదేరాడు అగస్త్యుడు.పవిత్ర గోదావరీ ప్రాంతాన్ని పావనం చేసి కృష్ణాతీరం లోకి అడుగుపెట్టారు ఆ పుణ్యదంపతులు.కనకదుర్గామాతను, శ్రీకాకుళాంద్ర మహావిష్ణువుని దర్శించుకొని వ్యాఘ్రపురం (పులిగడ్డ) చేరుకున్నారు.

"వ్యాఘ్రస్య పూర్వదిగ్భాగే కుమార క్షేత్ర ముత్తమమ్ "
"సుబ్రహ్మణ్యేన సత్యత్ర భుక్తి ముక్తి ఫలప్రదమ్"

అనేమాట అప్రయత్నంగా మహర్షి గళం నుండి వెలువడింది. ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండివుంది.లోపాముద్రా దేవి, శిష్యబృందము ఆయనను అనుసరించారు. ఒకపుట్ట నుండి దివ్యతేజస్సుని గమనించి ఇదే సుబ్రమణ్య క్షేత్రమని, ఇది భుక్తి ముక్తి ఫలప్రదమని శిష్యులకు వివరించాడు. కుమారమూర్తికే సుబ్రమణ్యమనెడి పేరని మాండవ్యుడనే శిష్యుని సందేహాన్ని నివృత్తి చేశాడు. కుమారస్వామి ఉరగ (పాము) రూపంలో తపస్సు చేయడానికి గల కారణాన్ని ఈ విధంగా శిష్యులకు వివరించారు.