News and Entertainment

అవును… సమంతనే అని నాగ్‌ ధ్రువీకరించారు

నాగచైతన్య, సమంత ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై నాగార్జున తొలిసారి స్పందించారు. గురువారం హైదరాబాద్‌లో నాగార్జున పాత్రికేయులతో ముచ్చటిస్తున్నప్పుడు చైతన్య పెళ్లి అంశం ప్రస్తావనకు వచ్చింది.
”త్వరలోనే చైతూకీ, అఖిల్‌కీ పెళ్లి చేయబోతున్నాం…” అని నాగ్‌ ధ్రువీకరించారు. మరి నాగచైతన్య పెళ్లి ఎవరితో అనే ప్రశ్నకు బదులిస్తూ ”మీకు తెలిసిన విషయమే. మీరే పత్రికల్లో రాస్తున్నారు కదా? తనే…
సమంత” అని చెప్పేశారు. అయితే పెళ్లి ఎప్పుడన్నది మాత్రం ఇంకా నిర్ణయించలేదన్నారు. ”పిల్లల నిర్ణయాన్ని గౌరవించాలి కదా? వాళ్ల ఆనందమే నా ఆనందం.
చైతూ ఎప్పుడంటే అప్పుడే పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంతా తన నిర్ణయం ప్రకారమే జరుగుతుంది” అన్నారు నాగార్జున. మరోవైపు అఖిల్‌ – శ్రియా భూపాల్‌ల నిశ్చితార్థానికి ముహూర్తం ఖరారైంది. డిసెంబరు 9న వీళ్ల నిశ్చితార్థం జరుపుతున్నట్టు నాగ్‌ తెలిపారు.
అందరికీ షేర్ చెయండి


loading...