News and Entertainment

శాతకర్ణి టైటిల్‌ సాంగ్‌ అదిరిపోయింది


నందమూరి హీరో బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి శరవేగంగా తెరకెక్కుతుంది. క్రిష్ దర్శకత్వంలో భారీ స్థాయి బడ్జెట్తో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈసినిమా టైటిల్ సాంగ్ లీక్ అయ్యింది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతుంది.

చాలా పవర్ ఫుల్గా ఈ సాంగ్ ఉంది. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుడు చిరంతన్ భట్ సంగీతాన్ని అందిస్తున్న విషయం తెల్సిందే. శ్రియ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో హేమా మాళిని ముఖ్య పాత్రలో కనిపించబోతుంది.




loading...