News and Entertainment

అలర్ట్:యుద్ధం కోసం విమానాలను రోడ్లపైకి తెస్తున్న పాక్ ఆర్మీ?


విమానాలను రోడ్లపైకి తేవడంలో పాకిస్థాన్ వైమానిక దళం శిక్షణ పొందుతోందట. దేశ రాజధాని ఇస్లామాబాద్, లాహోర్ మధ్య రహదారిని మూసేసి మరీ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇది సాధారణ శిక్షణేనని, ఉరీ ఘటన నేపథ్యంలో పెరిగిన ఉద్రిక్తలు కారణం కాదని వైమానిక దళాధికారులు చెప్తున్నారు.

పాకిస్థాన్ వైమానిక దళం అధికార ప్రతినిధి కమొడోర్ జావేద్ మహ్మద్ అలీ మాట్లాడుతూ విమానాలు రోడ్లపైకి వచ్చాయని, కొన్నేళ్ళుగా వాళ్ళు ఇలాగే చేస్తున్నారన్నారు. రన్‌వేలు పాడైనా, అందుబాటులో లేకపోయినా ఈ డ్రిల్ ఉపయోగపడుతుందన్నారు. ఈ విన్యాసాలను ఇటీవల ఇండియాతో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో నిర్వహించడం లేదన్నారు. కాకతాళీయంగా మాత్రమే ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతోందని తెలిపారు.


loading...