News and Entertainment

మాన మర్యాదలు కాపాడాల్సిన తల్లిదండ్రులే ఆ అమ్మాయి ఫోటోలను ఛీ ఛీ... పైగా తండ్రిగా హక్కు ఉందంట


కూతురి మాన మర్యాదలను కాపాడాల్సిన తల్లిదండ్రులే ఆమె నగ్నచిత్రాలను ఫేస్‌బుక్‌లో పెట్టిన విభ్రాంతికరమైన ఘటన ఆస్ట్రియా దేశంలో జరిగింది. ఆస్ట్రియా దేశానికి చెందిన 18 ఏళ్ల యువతి సన్నిహితునితో అన్యోన్యంగా గడుపుతున్న చిత్రాలు, మంచంపై నగ్నంగా పడుకున్న చిత్రాలను ఆమె అనుమతి లేకుండానే సాక్షాత్తు ఆమె తల్లిదండ్రులే ఫేస్‌బుక్‌లో పెట్టి నీచమైన పని చేశారు.

2009వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు తన కూతురు అశ్లీలంగా ఉన్న 500 చిత్రాలను ఫేస్‌బుక్‌లో పెట్టి ఆయా నగ్న చిత్రాలను తమ 700 మంది స్నేహితులకు షేర్ చేసిన సంఘటన అందరినీ కలవరానికి గురిచేసింది. తాను టాయ్ లెట్ గదిలో ఉన్నపుడు, మంచంపై నగ్నంగా పడుకున్నపుడు ఇలా ప్రతి దశలోనూ తీసిన ఫోటోలను ఫేస్‌బుక్‌ లో పెట్టి తన పరువును మంట కలిపారని సదరు యువతి ఆవేదన వ్యక్తం చేసింది.
తన అశ్లీల ఫోటోలను తొలగించమని తాను ఎన్నిసార్లు కోరినా తన తండ్రి వాటిని తొలగించకపోగా, ఆ ఫోటోలు పెట్టే హక్కు తండ్రిగా తనకు ఉందని చెప్పడం విశేషం. దీనిపై సదరు బాధిత యువతి తన తల్లిదండ్రులపై కోర్టుకు వెళ్లింది.

కూతురి అశ్లీల చిత్రాలు పెట్టి ఆమె వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించారని, ఆమెకున్న హక్కులను కాలరాచారని యువతి న్యాయవాది మైఖేల్ రామి చెప్పారు. ఆస్ట్రియా దేశంలో మొట్టమొదటి సారి ఇలాంటి కేసు నమోదైందని, అదే విదేశాల్లో అయితే ఇలాంటి కేసుల్లో తల్లిదండ్రులు కూతురికి నష్టపరిహారం చెల్లించడంతోపాటు ఆమె పడిన బాధకు, న్యాయ ఖర్చులు భరించేలా తీర్పు వెలువడుతుందని న్యాయవాది రామి పేర్కొన్నారు
.కోర్టులో ఈ కేసు విచారణ నవంబరులో జరగనుంది.

ఈ కేసులో యువతి తల్లిదండ్రులు ఓడిపోతే దాని పర్యవసానాలు ఆస్ట్రియాలో చాలామంది తల్లిదండ్రులపై ఉంటుందని సమాచారం. ఆస్ట్రియా దేశంలో అమలులో ఉన్న చట్టాలు సోషల్ మీడియా విషయంలో కఠినంగా లేవు. కానీ ఫ్రాన్స్ దేశంలో ఇలా ఒకరి ఆమోదం లేకుండా మరొకరు వారి చిత్రాలు సోషల్ మీడియాలో పెడితే వారికి ఏడాది జైలు శిక్షతోపాటు 45,000 యూరోల జరిమానా కూడా విధిస్తారట. ఈ కేసు తీర్పు కోసం నవంబరు నెల వరకు వేచి చూడాల్సిందే.

Source: ABNAJ


loading...