News and Entertainment

ఇంట్లో నెమలి ఈకలు పెట్టుకుంటే ఏమౌతుందో తెలుసా?


నెమలి ఈకలను ఇంట్లో బల్లులు తిరిగే ప్రదేశాల్లో ఉంచితే వాటిని చూసి బల్లులు పారిపోతాయి. ఇది ఎప్పటినుంచో వాడుతున్నదే. కానీ కొంతమందికి మన విధానాలు తెలియకపోవడం వలన ఇదేదో కొత్తగా అనిపించవచ్చు కానీ ఇది చాలామంది ఇళ్లల్లో వాడిదే. అయితే, నెమలిని చూస్తే బల్లులు పారిపోవడమే అందుకు కారణం. ఈ క్రమంలో కేవలం బల్లులు మాత్రమే కాదు, అసలు వర్షాకాలంలో మన ఇళ్లల్లోకి వస్తూ మనల్ని నానా ఇబ్బందులు పెట్టే ఎన్నో కీటకాలు, పురుగులు, చీమలు, ఈగలు, దోమలను కూడా కింద ఇచ్చిన పలు సహజ సిద్ధమైన చిట్కాలతో దూరం చేసుకోవచ్చు.ఈ కాలంలో ప్రబలే డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాల నుంచి దూరంగా ఉండవచ్చు. ఇవే కాదు, ఇంకా ఎన్నో ఇతర అనారోగ్యాలు కూడా రాకుండా ఉంటాయి. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

బల్లులు తిరిగే ప్రాంతాల్లో నెమలి ఈకలు ఉంచాలి. ఇవి బల్లులను తరిమేస్తాయి. అంతేకాదు, ఇంట్లో ఆకర్షణీయంగా కూడా కనిపిస్తాయి.
కోడిగుడ్డు పెంకులను తీసుకుని వాటికి ఏవైనా రంగులు పెయింట్ లా వేయాలి. అనంతరం వాటిని బల్లులు ఉండే ప్రదేశాల్లో వేలాడదీయాలి. దీంతో బల్లులు ఇకపై రాకుండా ఉంటాయి.
కొంత వోడ్కా తీసుకుని అందులో ఎసెన్షియల్ ఆయిల్ కలపాలి. దీన్ని రూమ్ లో స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల బల్లులు పారిపోతాయి. అంతేకాదు రూమ్ అంతా మంచి సువాసన కూడా వస్తుంది