News and Entertainment

వాటర్ ఫిల్టర్లు వాడుతున్నారా..?? వాడకపోయినా సరే ఈ విషయం ఒక్కసారి చదవండి


 రోజుల్లో వాటర్ ఫిల్టర్ లా అనుకుంటున్నారా.. అవునండి అవి వాడే వారు కూడా లేకపోరు. మినరల్ వాటర్ సౌలభ్యం ఉన్న వారు సరే మరి లేని వారు చాలామందే ఉన్నారు. మురికిగా వున్న నీటిని తాగడం వలన అనేక వ్యాధులు వస్తుంటాయి. అందుకోసం వాటర్ ఫిల్టర్ల ఉపయోగించడం ఉత్తమం. అలాగే వాటిని శుభ్రపరచడంలో జాగ్రత్త పడుతూ ఉండాలి.

నీటి కాలుష్యం వల్ల అనేక వ్యాధులు వస్తుంటాయి. వాటర్ ఫిల్టర్ ఉపయోగం వల్ల నీటి కాలుష్యం నుండి కొంతైన మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి మంచి నీటి కోసం వాటర్ ఫిల్టర్లు ఉపయోగించడం ఉత్తమం. ప్రస్తుతం అందరి ఇళ్ళల్లో వాటర్ ఫిల్టర్ వాడుతుంటాం. వాడడంతో పాటే వాటిని శుభ్రపరచడంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
వాటర్ ఫిల్డర్ కొత్త క్యాండిల్ బిగించిన తర్వాత పిల్టర్ అయిన నీళ్ళు మట్టివాసన వస్తాయి. అందుచేత కొత్తక్యాండిల్‌ను బిగించబోయేముందు ఆ క్యాండిల్స్ నీళ్ళలో మునిగేటట్లుగా ఒకటి రెండు రోజులు నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాతనే ఉపయోగించాలి.
వారానికి రెండుమూడుసార్లు వాటర్‌ఫిల్టర్ క్యాండిల్స్‌ను శుభ్రం చేయాలి. లేకపోతే క్యాండిల్స్ మురికావడంతో పాటు క్యాండిల్స్ అమర్చిన డబ్బాలో అడుగున మట్టిచారలు పేరుకుని ఫిల్టర్ మురికి అవుతుంది.
క్యాండిల్స్ బాగా నల్లగా అయి అవి మురికిపట్టి వున్నప్పుడు సబ్బుపొడి కలిపిన వేడినీళ్ళలో వాటిని నానబెట్టి ఆ తర్వాత మెత్తని పీచుతో తోమితే క్యాండిల్స్ శుభ్రపడతాయి. క్యాండిల్స్‌ను శుభ్రపరచటానికి ప్రత్యేకమైన బ్రష్‌ను ఉపయోగించడం మంచిది.

చివరగా.. మంచినీరు ఎక్కువగా ప్యూరిఫై అయ్యే నీటికంటే ఇలా క్యాండిల్స్ ద్వారా ఫిల్టర్ అయ్యే నీటిలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని నాలుగైదు నెలలకు ఒకసారి జాగ్రత్తగా తీసి వేడినీటిలో ఉడకబెడితే వాటి పనితీరు మరింత మెరుగ్గా ఉంటుంది.
మినరల్ వాటర్ వల్ల కొంత మంది అనారోగ్యంతో బాధ పడుతున్నారని వింటూ వున్నాం. ఈ ఫిల్టర్ వల్ల అలాంటి సమస్యలు ఏమి ఉండవు. మన ఆరోగ్యం మన చేతిలోనే.

చక్కటి ఆహారం, శుభ్రమైన నీరు తీసుకుంటే మందుల ఖర్చు కూడా తగ్గుతుంది.


loading...