News and Entertainment

పోర్న్‌సైట్‌లో విజ‌య‌వాడ అమ్మాయి అశ్లీల వీడియోలు


ఇటీవ‌ల కాలంలో కొంత మంది యువ‌త ప‌విత్ర‌మైన ప్రేమ అనే ప‌దాన్ని భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నారు. చేసేది ఉన్న‌తమైన, హుందా అయిన ఉద్యోగం అయినా అమ్మాయిలను ప్రేమించే విష‌యంలో మాత్రం నిర‌క్ష్య‌రాస్యులు కూడా అలా ప్ర‌వ‌ర్తించి ఉండ‌రేమో అనేట్టు వీరి వ్య‌వ‌హార శైలి ఉంటుంది. వివ‌రాల్లోకి వెళితే.. త‌న ప్రేమను నిరాకరించిందనే అక్కసుతో ఓ సాప్ట్‌వేర్ ఇంజ‌నీర్ త‌న స‌హ‌చ‌ర ఉద్యోగినిపై క‌న్నేసి వేధింపుల‌తో సామాజిక మాద్య‌మాల్లో అల్ల‌రి చేసిన సంఘ‌ట‌న ఇది.

ఎలా అయినా తన సహచర ఉద్యోగినిని లోబరుచుకునేందుకు టెక్నాలజీని ఉపయోగించి చివరకు కటకటాలపాలయ్యాడు. కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం విజయవాడలో డీసీపీ–2 పాల్‌రాజు విలేకరులకు తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన మాదివాడ మురారి, విజయవాడ భవానీపురానికి చెందిన యువతి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మురారి ఆమెను పరిచయం చేసుకుని స్నేహితుడిగా నటించాడు. యువతి నివసించే గదిలో రహస్యంగా సీసీ కెమెరాలు అమర్చి అశ్లీల దృశ్యాలను వీడియోలో చిత్రీకరించాడు. ఆ వీడియోలను ఫోర్న్‌ వెబ్‌సైట్‌లో పెట్టి, ఆమె ఫోన్‌ నెంబర్‌ను కూడా జతచేశాడు. విషయం తెలుసుకున్న యువతి తన తండ్రితో కలసి హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ యువతిని విజయవాడలోని భవానీపురం పోలీస్‌స్టేషన్‌కు పంపారు.

ఆమె భవానీపురం పోలీసులకు నిందితుడిపై ఫిర్యాదు చేసింది. పోలీస్‌ కమిషనర్‌ డి.గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాలతో పోలీసులు సోమవారం హైదరాబాద్‌ వెళ్లి మురారిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా యువతి అశ్లీల వీడియోలను తానే నెట్‌లో పెట్టినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి జైల్లో కూర్చోబెట్టారు.

అందరికీ షేర్ చెయండి


loading...