News and Entertainment

పవన్ గురించీ నిజాలు చెప్పిన పూరి జగనాథ్


పవన్ కళ్యాణ్ నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అయినా పూరి పవన్ కాంబినేషన్ లో వచ్చిన బద్రి సినిమా ను పవన్ అభిమానులు ఇప్పటికి మర్చిపోలేరు . మళ్ళి అటువంటి రికార్డు పవన్ తో క్రియేట్ చేద్దామని దర్శకుడు పూరి కెమెరా మెన్ గంగ తో రాంబాబు సినిమా ద్వారా ప్రయత్నించినా ఆ ప్రయోగం విజయ వంతం కాలేదు . ఈ సినిమా తరువాత వీరిద్దరి భంధం ఫై రకరకాల వార్తలు కూడా వచ్చాయి .


ఆ మధ్యన పవన్ కళ్యాణ్, పూరీ జగన్నాథ్ మధ్యన విభేధాలు వచ్చాయంటూ మీడియాలో వరసగా వార్తలు కూడా వచ్చాయి అయితే ఈ విషయాల ఫై పూరి నిన్న ప్రసారం అయిన ఆంధ్రజ్యోతి చానెల్ ఓపెన్ హార్ట్ ప్రోగ్రాం ను బాగా ఉపయోగించుకున్నాడు. అసలు ఈ విభేధాల వార్తలు అ ఎలా పుట్టుకు వచ్చాయో కూడా వివరించాడు పూరి. తాను 'ఇద్దరమ్మాయిలతో..' సినిమా ప్రమోషన్ కోసమని ఛానెళ్లలో ఇంటర్వ్యూలిస్తున్న సమయం లో ఒక కాలర్ 'పవన్‌తో సినిమా వచ్చే ఏడాది ఉంటుందా..' అంటే 'ఉండచ్చు..' అన్నానని, దాన్ని పట్టుకొని మరో కాలర్ 'అందులో హీరోయిన్ ఎవరు..' అంటూ వరస పెట్టి అదే కార్య క్రమo లో ఒక పది ప్రశ్నలు ఇలా పవన్ సినిమా గురించే రావడం తో ఆ రోజు ఛానళ్లలో పవన్‌తో తాను చేయబోయే సినిమా అనేది హాట్ టాపిక్కయి కూర్చుంది అని చెప్పాడు పూరి.

ఆ తరువాత తనను దక్కన్ క్రానికల్ వాళ్లొచ్చి కొత్త సినిమాలో పవన్ ను ఎలా చూపిస్తారు? అని ఆడిగే సరికి విసుగొచ్చి పవన్ తో సినిమా అయినప్పుడు చూద్దాం అని చెప్పానని, దానికి అనేక అర్ధాలు తీస్తూ తనకు పవన్ కు భేదాభిప్రాయాలు వచ్చాయి అంటూ మీడియా రకరకాల కధనాలు రాసింది అంటూ, పవన్ కు తనకు వచ్చిన భేదాభిప్రాయల రూమర్లు మీడియా సృష్టి మాత్రమే అంటూ మరో కొత్త ట్విస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాడు పూరి. ఇదే కార్య క్రంలో మట్లాడుతూ పూరి తాను ఒక సందర్భం లో ఏకంగా 85 కోట్లు డబ్బు పోగొట్టుకున్నాని చెప్తూ.. అంత డబ్బు పోతే ఎవరైనా డిప్రెషన్‌లోకి వెళ్తారు అని అంటూ కానీ తాను ఆ పరిస్థితులను ఎదిరించి నిలదోక్కుకున్నానని వివరించాడు పూరి.


ఇదే సందర్భం లో తన పోకిరి సినిమా గురించి మాట్లాడుతూ నిజానికి పోకిరి తర్వాత మూడేళ్ల పాటు ఏ సినిమా తీసినా 'పోకిరిలా లేదు..' అనడం మొదలెట్టారు అని అంటూ,. అసలు అంత బాగా నేనేం తీశానా అని మళ్లీ ఆ సినిమా ను ఎన్ని సార్లు తాను చూసినా నిజం గా పోకిరి సినిమా లో అంత ఏమి బాగుందో తనకు ఇప్పటికీ అర్ధం కాని నిజం అంటూ మరో బాంబు పేల్చాడు పూరి జగన్నాథ్ .
SHARE IT 


loading...