News and Entertainment

పెళ్లి చూపులు చూశాడు.. నో చెప్పిందని రేప్‌ చేశాడు


తెలిసిన వారి ద్వారా వారి అమ్మాయికి సంబంధం వచ్చింది. అయితే అమ్మాయి తల్లిదండ్రులకు మరియు ఆ అమ్మాయికి కూడా ఆ అబ్బాయి నగేష్‌ పెద్దగా నచ్చలేదు. అతడు తమ స్థాయికి తగిన వాడు కాదు అని అమ్మాయి తల్లిదండ్రులు నిర్ణయించుకుని అబ్బాయి తరపు వారికి కబురు పంపారు. మరో వైపు ఆ అబ్బాయి పెళ్లి చూపులు చూసిన అమ్మాయితో డ్రీమ్స్‌ వేసుకుంటున్నాడు. తన స్థాయికి అలాంటి అమ్మాయి లభించడంతో ఉబ్బి తబ్బిబవుతున్నాడు. ఈ సమయంలో అతడిని నో అనే కబురు అందడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. కోపంతో పిచ్చి వాడు అయ్యాడు. ఆ అమ్మాయిని తనదాన్ని చేసుకోవాలని గట్టి పట్టుదతో ఏం చేసేందుకు అయినా సిద్దం అయ్యాడు. 




నాలుగు రోజుల పాటు ఆ అమ్మాయిని వెంటాడిన నగేష్‌ అయిదవ రోజు ఆమెను బలవంతంగా కారులో ఎక్కించాడు. కారులో ఆమెకు మత్తు మందు ఇచ్చాడు. నిర్మాణుశ ప్రాంతానికి తీసుకు వెళ్లాడు. మత్తులో ఉన్న ఆమెపై పైసాచికంగా రేప్‌కు పాల్పడ్డాడు. ఆమెకు తీవ్రంగా రక్తస్రవం కావడంతో భయపడ్డ నగేష్‌ విషయం బయటకు తెలిస్తే పెళ్లి సంగతి పక్కన పెట్టి జైలుకు వెళ్లాల్సి వస్తుందని గుట్టు చప్పుడు కాకుండా ఆ అమ్మాయిని చంపేశాడు. తమ కూతురు కనిపించడం లేదు అని పోలీసులుకు ఫిర్యాదు చేశారు ఆ తల్లిదండ్రులు. విచారణ మొదలు పెట్టిన పోలీసులకు నగేష్‌ చంపాడు అని ఎంక్వౌరీలో తేలింది. అతడిని పట్టుకుని తంతే మొత్తం విషయం చెప్పాడు. ఈ సంఘటన గుజరాత్‌ రాష్ట్రంలో జరిగింది.
షేర్ చేయండి

loading...