News and Entertainment

నా అందాన్ని చూపిస్తే తప్పేంటి?


‘జబర్దస్త్‌’ యాంకర్‌ రష్మీ తాజాగా బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాతో రెచ్చి పోతుంది. జబర్దస్త్‌తో వచ్చిన క్రేజ్‌తో ఈ అమ్మడు వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతుంది. అయితే ఈమె చేసే సినిమాలు మామూలు సినిమాలు కాదు. ఈమె బి గ్రేడ్‌ చిత్రాల్లో నటిస్తూ కుర్రకారుకు మత్తెక్తిస్తోంది. భారీ స్థాయిలో అందాలను ప్రదర్శిస్తూ అదరహో అనిపిస్తుంది. ఈ అమ్మడు అందాలతో మరియు అభినయంతో చిన్న సినిమాలను కాస్త పెద్ద సినిమాలుగా మారుస్తుంది. 

దాంతో ఈమెతో సినిమాలు చేసేందుకు చిన్న నిర్మాతలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. భారీ పారితోషికం ఇచ్చి మరీ ఈమెతో సినిమాలు చేస్తున్నారు. అందాల ప్రదర్శణ గురించి ఈ అమ్మడిని మీడియా వ్యక్తి తాజాగా ప్రశ్నించగా.. అందంగా ఉన్నప్పుడు చూపించడంలో తప్పేంటి. నాకంటే ఎక్కువగా తెలుగు సినిమాల్లోనే ఎంతో మంది హీరోయిన్స్‌ గ్లామర్‌ను ఒలకబోశారు. మరి నేను అలా చేస్తే ఎందుకు విమర్శలు అంటూ రష్మీ అంటోంది. అందాలు ఉన్నప్పుడు చూపాలనేది తన సిద్దాంతం అని, అందులో ఎలాంటి అనుమానం లేదు అంటూ రష్మీ చెప్పుకొచ్చింది. ముందు ముందు ఈమె నుండి మరింత గ్లామర్‌ పాత్రలు ప్రేక్షకులు చూడవచ్చు. 
షేర్ చేయండి






loading...