News and Entertainment

అందుకే న్యూడ్‌ షోకు సిద్దపడ్డ!


ప్రస్తుతం బాలీవుడ్‌లో పూనం పాండే స్టార్‌ సెలబ్రెటీగా దూసుకు పోతుంది. ఈ అమ్మడు అందాల ఆరబోతతో పాటు ఐటెం సాంగ్స్‌ చేస్తూ యూత్‌ ఆడియన్స్‌కు మత్తెక్కిస్తోంది. ఈ అమ్మడు బాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటించడంతో పాటు అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో ఈమె పెట్టే పోస్ట్‌లు మరియు ఫొటోలు, వీడియోలు ఈమెకు మరింత పబ్లిసిటీని తీసుకు వస్తున్నాయి. 2011 ముందు వరకు ఈమె పెద్దగా ఎవరికి తెలియదు. ఆ సంవత్సరం జరిగిన ప్రపంచకప్‌లో ఇండియా గెలిస్తే న్యూడ్‌ షో చేస్తాను అంటూ ప్రకటించింది.

ఆ ఒక్క ప్రకటనతో పూనం పాండే సెలబ్రెటీ అయ్యింది. భారీ స్థాయిలో ఈమెకు ఆ ప్రకటన క్రేజ్‌ తీసుకు వచ్చింది. తాజాగా ఈ అమ్మడు ఆ విషయం గురించి మాట్లాడుతూ ఏదోలా అందరి దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశ్యంతో అలాంటి ప్రకటన చేసినట్లుగా చెప్పుకొచ్చింది. ఆ ఒక్క ప్రకటనతో తనకు అనుకున్నదానికి రెట్టింపు క్రేజ్‌ దక్కిందని, దాంతో పాటు సినిమాల్లో ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి అని చెప్పుకొచ్చింది. ఎక్కువగా గ్లామర్‌ పాత్రలే అవ్వడంతో కొన్ని సినిమాలకు నో చెప్పినట్లుగా చెప్పుకొచ్చింది. ప్రచారం కోసం చేస్తానన్న న్యూడ్‌ షో చేయకుండానే ఈమెకు భారీ క్రేజ్‌ దక్కింది. ఈమె క్రేజ్‌కు కారణం సోషల్‌ మీడియా.
షేర్ చేయండి


loading...