News and Entertainment

జియో సిమ్ కొనాలనుకునేవారికి శుభవార్త.. ఈ నిర్ణయంతో వినియోగదారులకు మరింత మేలు


రిలయన్స్ జియో... ఇప్పుడు సిమ్ ను పొందినా మూడు నెలలకు పైగా ఉచిత 4జీ ఇంటర్నెట్, వాయిస్ కాల్స్ సౌకర్యాన్ని అనుభవించవచ్చు. ఇప్పటికీ సిమ్ ల కొరత కనిపిస్తూనే ఉండగా, రిలయన్స్ డిజిటల్ స్టోర్లు, రిలయన్స్ డిజిటల్ ఎక్స్ ప్రెస్ స్టోర్ల ముందు సిమ్ ల కోసం క్యూలు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే, సిమ్ లను సులువుగా పొందేందుకు రిలయన్స్ సంస్థ ఓ మార్గాన్ని వెల్లడించింది.


ఎలక్ట్రానిక్ కెవైసి (ఇ-కెవైసి) విధానం ద్వారా కొత్త సిమ్లను తొందరగా యాక్టివ్ చేసేందుకు రాష్ట్రం లో మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు రిలయన్స్ జియో ప్రకటించింది. 4జి మొబైల్ ఫోన్ కలిగిన కస్టమర్లు తమ ఆధార్ నెంబర్తో సమీపంలోని జియో రిటైల్ కేంద్రాలు, రిలయన్స్ డిజిటల్, డిఎక్స్ మినీ స్టోర్లు, ఇతర స్టోర్లకు వెళ్లి రెండు నిమిషాల వ్యవధిలోనే సిమ్ను పొందవచ్చని పేర్కొంది. 

టెలికాం విభాగం నుంచి కొత్త నెంబర్ సీరిస్, సిమ్లకు అనుమతి వచ్చిన నేపథ్యంలో ఎక్కువ మంది కస్టమర్లకు సిమ్లను అందించే అవకాశం ఏర్పడుతున్నట్టు తెలిపింది. జియో వెల్కమ్ ఆఫర్లో భాగంగా డిసెంబర్ 31 వరకు ఉచితంగా అపరిమిత 4జి సేవలను రిలయన్స్ జియో అందజేస్తున్న విషయం తెలిసిందే.


loading...