News and Entertainment

ఎంత చేసిన ఎక్కిళ్ళు ఆగటం లేదా... ఈ సింపుల్ టెక్నిక్ చాలు ఆగిపోతాయ్


ఏదైనా తినేటపుడు ఒక్కసారిగా ఎక్కిళ్లు మొదలవుతాయి. వెంటనే మంచినీళ్లు తాగకపోతే చాలా ఇబ్బంది. అలా తాగినా కొందరిని ఎక్కిళ్లు చాలాసేపు వేధిస్తాయి. అలాంటి వారు ఇంట్లో దొరికే వాటితో వాటిని నివారించవచ్చు.ఎక్కిళ్లు వస్తున్నప్పుడు చిన్న అల్లంముక్క బుగ్గన పెట్టుకుని చప్పరిస్తే త్వరగా తగ్గుతాయి. రెండు చుక్కల వెనిగర్ కూడా నాలుకమీద వేసుకుంటే దాని పుల్లతనానికి కూడా ఎక్కిళ్లు ఆగిపోతాయి. యాలకులు కూడా ఎక్కిళ్ల ఆగటానికి ఉపయోగపడతాయి. కప్పున్నర నీళ్లలో చెంచాడు

యాలకుల పొడి వేసి మరిగించాలి. తర్వాత వడకట్టి తాగాలి. ఆ నీళ్లవల్ల గొంతూ, శ్వాసకోస వ్యవస్థ ఉత్తేజితమై ఎక్కిళ్లు తగ్గుతాయి.ఇక చిటికెడు ఆవాలపొడిలో అరచెంచా నెయ్యి కలిపి ఆ మిశ్రమాన్ని తినాలి. ఒక చెంచాడు పంచదార నోట్లో వేసుకున్నా ఫలితం ఉంటుంది.

loading...