News and Entertainment

దొంగ స్వామీజీల సీక్రెట్ ఇదే…!


దొంగస్వాములు, బురిడీ బాబాలకి మనదేశంలో కొదవలేదు. దొంగ స్వాముల బండారాలు రోజూ బయటపడుతున్నా స్వాములకి డిమాండ్ తగ్గడం లేదు. రోజుకో కొత్తబాబా పుట్టుకొస్తున్నాడు. టీవీ ఛానల్స్ లో స్లాట్స్ కొనుక్కుని మరీ బాబాలు,స్వామీజీలు చెలరేగి పోతున్నారు. ఈ బాబాలు, స్వామీజీల సక్సెస్ సీక్రెట్ తెలుసుకునేముందు, అసలు బాబాలకి డిమాండ్ ఎందుకు వచ్చిందో చూద్దాం.

బాబాలు,స్వామీజీలకి డిమాండ్ ఎందుకు పెరిగింది అంటే..?
హిందూ సమాజంలో ఆలయాలకి చాలా ప్రాధాన్యత ఉంది. ఒక గ్రామ ప్రజలు తమకి ఏ కష్టం వచ్చినా ఆలయానికి వెళితే అక్కడ పూజారుల నుండి స్వాంతన లభించేది.  ఏదో తమకి తోచిన పరిష్కారం చెప్పేవాళ్ళు. గుడిలో దేవుడు మాట్లాడకపోయినా, పూజారి ఆ లోటు తీర్చగలిగేవారు. క్రమేణా ఆలయాలు నిర్లక్ష్యానికి గురై, దేవుడి మాన్యాలు ఆక్రమణలకి గురై, పూజారులకే పూటగడవడం కష్టం అయింది.ఇది 1990 లకి ముందు మాట. ఆర్ధిక సంస్కరణల కారణంగా దేశం లో సంపద పెరిగి, మధ్యతరగతి పెరిగి, వాళ్ల కోర్కెల చిట్టా పెరిగాక, పిలిస్తే పలికే దేవుడు అవసరం అయ్యాడు. ఆ అవసరాన్ని  బాబాలు, స్వామీజీల  తీరుస్తున్నారు. అంతకు ముందు కూడా స్వామీజీలు బాబ్లు ఉన్నారు కానీ , ఈ రేంజ్ లో పెరగడం గత 20 ఏళ్లలో వచ్చిన మార్పు. ఇప్పుడిప్పుడే ఆలయాలలో పరిస్థితి మెరుగుపడుతోంది కానీ, బాబాలు స్వామీజీలు బాగా అడ్వాన్స్ అయిపోయారు.


PAGES:
1   2   3

loading...