News and Entertainment

షాకింగ్:నచ్చిన లక్షణాలతో సంతానాన్ని ఇచ్చే యాప్


ఒక ఆన్ లైన్ కిచెన్ కు ఇచ్చే ఆర్డర్ ఇది ఈ సంభాషణ వినండి ‘‘హల్లో, ఆర్డర్ తీసుకుంటారా? కాస్త పెప్పర్ చల్లండి, కారం పొడి వద్దు, ఉప్పు జస్ట్ కాసింత బట్టర్, చీజ్ మస్ట్ కొంచెం ఎక్కువ కాలినా సరే, కానీ తరిగిన ఉల్లిపాయలు, అల్లం ముక్కలు మాత్రం వేసి తీరాలి పైన కొత్తిమిర చల్లండి అంతే, అంతే…’’

సీన్ కట్ చేయండి ఇప్పుడు ఇంకో సంభాషణ వినండి ఇదోరకం ఆర్డర్ అంతే ‘‘హల్లో ప్లీజ్ ఆర్డర్ తీసుకొండి కలర్ వైట్, హైట్ కనీసం ఆరు ఫీట్లు, కళ్ల కలర్ ఆసియన్ స్టయిల్. యుద్ధంలో పనిచేసినవారా వద్దు లెండి, ఎవరైనా స్పోర్ట్స్ పర్సనాలిటీ గానీ, సినిమా సెలబ్రిటీ గానీ చూడండి కంపల్సరీ డార్క్ బ్లాక్ హెయిర్ అంతే, అంతే…’’

ఏమిటీ ఆర్డర్ అని తెల్లమొహం వేస్తున్నారా? లండన్ లో ఓ ఫర్టిలిటీ డాక్టర్, మన ఇండియన్ సంతతే ఓ వినూత్న యాప్ తయారు చేశాడుపేరు, డాక్టర్ కమల్ అహుజా ఆయనకు ఓ సైంటిఫిక్ స్పెరమ్ బ్యాంకు ఉంది. తల్లులు కావాలనుకున్న స్త్రీల కోసం రూపొందిన ఈ యాప్ పేరు ఆర్డర్ ఏ డాడీ’…!!

950 పౌండ్లు చెల్లించేస్తే, స్మార్ట్ ఫోన్ లోని ఈ యాప్ ద్వారా రకరకాల కేరక్టర్స్ ను తమ చాయిస్ ద్వారా ఎంపిక చేసుకునే చాన్స్ ఉంటుందట ఎత్తు, కళ్లరంగు, కేశాలు, అంగసౌష్టవం, వృత్తి, విద్య, ఆసక్తి, అలవాట్లు వంటి వివరాలన్నీ వీర్యదాతల నుంచి సేకరించి రికార్డు చేసి ఉంటాయట వీర్యం ఇచ్చిన వారి ఫోటోలు, వివరాలు కూడా ఉంటాయట. తమకు పుట్టబోయే పిల్లలకు సరిగ్గా వీర్యదాతల లక్షణాలే రావాలని ఏమీ లేదు జెనెటిక్ ఆర్డర్ లో ఎప్పట్నుంచో ఓ లైన్ మెయింటెయిన్ అవుతుంటుంది. దీన్ని మరింత తేట భాషలో చెప్పుకోవాలంటే ఒక పిల్లవాడో, ఒక పాపో పుడితే తప్పకుండా వాళ్ల తల్లిదండ్రుల లక్షణాలో, తాతలు, బామ్మలు, అమ్మమ్మల లక్షణాలో ఉండాల్సిన అక్కర్లేదు మేనమామలు, మేనత్తల పోలికలూ, తాతల తల్లిదండ్రుల లక్షణాలు, ఇటువైపు, అటువైపు లక్షణాలు కలగలిపి కూడా ఉండొచ్చు ఓ ఫోటో చూసేసి, ఆ లక్షణాలతో కొడుకు పుట్టేస్తాడని భ్రమపడి, ఆ వీర్యాన్ని కొనుక్కుని, ఫర్టిలిటీ సెంటర్ ను ఆశ్రయిస్తే సరిపోతుందని అనుకుంటే అది అబ్సర్డ్


అయినా సరే, బ్రిటన్ లో ఈ యాప్ కు క్రేజ్ ఏర్పడిందట మరి!!


loading...