News and Entertainment

డాక్టర్ చదువు కోసం తన కన్యత్వాన్ని వేలానికి పెట్టిన 20 ఏళ్ళ అమ్మాయి.. ఎక్కడో తెలుసా



విదేశాల్లో మెడిసిన్ చదువుకోవాలనేది మాత్రమే ఆమె ముందున్న కోరిక. కానీ ఆ అమ్మాయి కుటుంబం ఆర్ధిక పరిస్థితి మాత్రం అంతంత మాత్రమే. ఇంట్లో వాళ్ళు ఇక మావల్ల కాదు అని చేతులెత్తేసారు. కానీ ఆ అమ్మాయి మాత్రం తన కోరికను తీర్చుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంది. ఎలాగైనా విదేశాల్లో వైద్య విద్య అభ్యసించాల్సిందేనని నిర్ణయించుకుంది. ఎలా? అని ఆలోచించగా చివరికి ఓ ఆలోచన తట్టింది. వెంటనే అమల్లో పెట్టేసింది. ఆన్లైన్లో తన కన్యత్వాన్ని వేలంలో పెట్టింది. ప్రారంభ బిడ్గా 1,30,500 పౌండ్లను కోట్ చేసింది. ఈ సందర్భంగా అరియానా మాట్లాడుతూ తనలాగే ఎందరో ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారని పేర్కొంది.

వివరాలలోకి వెళితే ఆ అమ్మాయి పేరు అరియానా, వయస్సు 20 సంవత్సరాలు. నివాసం ఉండేది రష్యా. మెడిసిన్ చదివేందుకు విదేశాలు వెళ్లాలనుకుంటున్నానని, కానీ అక్కడి యూనివర్సిటీ చాలా ఖరీదైనదని పేర్కొంది. అక్కడి రెంట్ నుంచి అన్నీ ఎక్కువేనని తెలిసు. నేనున్న పరిస్థితిలో అక్కడ ఉండి చదువుకోవడం మరింత కష్టం. అందుకే ఎలాగైనా చదువు కోసం డబ్బులు సంపాదించాలని నా కన్యత్వాన్ని ఆన్లైన్లో వేలానికి పెట్టా’’ అని అరియానా వివరించింది. అయితే ఆమె తన కన్యత్వాన్ని వేలానికి పెట్టిన విషయం తల్లిదండ్రులకు తెలియకపోవడం గమనార్హం.


‘‘ఎవరో ముక్కు మొహం తెలియని వాడి కోసం ఎదురుచూసి వారికి నా కన్యత్వాన్ని అప్పగించిన తర్వాత అతడు నా హృదయాన్ని ముక్కలు చేసి వెళ్లిపోతాడు. అటువంటి వారి కోసం ఎదురుచూసి మరీ కన్యత్వాన్ని ఎందుకు అప్పగించాలి. దానిని నా చదువుకోసం వినియోగిస్తా’’ అని అరియానా పేర్కొంది. తానో స్వేచ్ఛ గల, స్వతంత్ర మహిళనని పేర్కొన్న ఆమె తన స్నేహితురాలు లోలిత కూడా ఇలాగే తన కన్యత్వాన్ని వేలానికి పెట్టినట్టు వివరించింది. తన కన్యత్వాన్ని గెలుచుకున్నవాడు తనను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడని, తనకు తగిన గౌరవం ఇస్తాడని అరియానా తన మనసులో మాటను వ్యక్తం చేసింది.