News and Entertainment

వినాయకుడికి నైవేద్యంగా మంసాహారం, మద్యం…!!! (వింత ఆచారం)


అదేంటీ విజ్ఞాలు తొలగించే వినాయకుడికి ఎంతో నిష్టతో ఉండ్రాళ్ల పాయసం, పండ్లూ ఫలాలు, పులిహోర నైవేద్యంగా పెడతారు.. చికెన్, మటన్, చేపలు, విస్కీ పూజ చేయడం అపచారం..అపచారం అనుకుంటున్నారా..! కానీ ఇది నిజం అక్కడ ఇలాగే పూజిస్తారు. మద్యాన్ని విగ్రహంపై చల్లుతారు. ఇదేమంటే.. తరతరాలుగా తామీ ఆచారారం అంటారు..ఇంతకీ ఈ తంతు ఎక్కడో తెలుసా..! కర్ణాటకలోని కొప్పల్‌ జిల్లాలోని భాగ్యనగర్ గ్రామంలో ప్రతి సంవత్సరం వినాయకుడి పూజలో అక్కడి ప్రజలు గణేశుడికి మాంసం, మద్యం నైవేద్యంగా పెడతారట.


ఈ గ్రామానికి చెందిన క్షత్రియ తెగకు చెందిన వంద కుటుంబాల వారు గణేశుడిని మాంసం, మద్యం నైవేద్యంగా సమర్పించి పూజిస్తారట.ఇది ఇప్పుడు వస్తున్న ఆచారం కాదని తర తరాలుగా తమ తాత ముత్తాలు ఇలాగే చేసేవారని ఇలా చేస్తే స్వామి వారు సంతోషిస్తారని అక్కడివారి ఆచారమట. తరతరాలుగా ప్రతి ఏటా భాగ్యనగర్ గ్రామంలో వంద కుటుంబాలు కలిసి ఇలా మద్యం, మాంసాలను నైవేద్యంగా పెట్టడం ఒక ఆచారంగా నడుస్తోంది.వీధుల్లో వినాయక పూజకు మాత్రం మిగతా అందరిలాగే ఫక్తు శాకాహార నైవేద్యాలే పెడుతారు. ఐదు రోజులపాటు గణేష చతుర్థిని జరుపుకుంటామని మూడో రోజూ మాంసాహారాన్ని సమర్పిస్తామని అక్కడి నిర్వాహకులు తెలిపారు. తాజాగా దీనికి సంబంధించి వార్త సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తుంది. ఏది ఏమైనా ఎంతో నియమ నిష్టలతో పూజించే వినాయకుడికి ఇలా పూజించడం ఏంటీ అని భక్తలు నివ్వెర పోతున్నారు.
షేర్ చేయండి
loading...