News and Entertainment

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడుపై తమన్నా..!


టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది. మొదటి పార్ట్ విడుదల అయ్యి సంచలనాన్ని సృష్టించిన విషయం తెల్సిందే. భారీ స్థాయిలో ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో పాటు, ఆ సినిమా క్లైమాక్స్లో కట్టప్ప బాహుబలిని చంపినట్లుగా చూపించారు. దాంతో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న ఎక్కడ చూసినా కూడా ఎదురవుతుంది. ఈ విషయాన్ని గురించి చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఎక్కడ నోరు జారడం లేదు. తాజాగా ఆ సినిమాలో నటించిన తమన్నా ఆ విషయంపై వింతగా స్పందించింది.


తమన్నా నటించిన అభినేత్రి చిత్రం ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్బంగా మీడియాతో ముచ్చటించిన ముద్దుగుమ్మ తమన్నా ఎందుకు కట్టప్ప బాహుబలిని చంపాడు అనే విషయంపై కామెడీగా స్పందించింది. మీడియా వారి నుండి వచ్చిన ప్రశ్నకు సమాధానంగా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో నాకు తెలియదు అని, ఆ సమయంలో తాను అక్కడ లేను అని చెప్పుకొచ్చింది. తనకు కూడా ఎందుకు బాహుబలిని కట్టప్ప చంపాడో తెలుసుకోవాలని ఉందని, సినిమా కోసం తాను ఎదురు చూస్తున్నాను అని తమన్నా చెప్పుకొచ్చింది.