News and Entertainment

మీ పాత ఫోన్ నుంచి బంగారం తీయొచ్చు.. ఎలానో తెలుసా

వాడిపారేసిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పై ఓ కెమెకిల్‌ను ప్రయోగించి ఏడాదికి ఏకంగా 300 టన్నుల బంగారాన్ని రాబడుతున్నట్లు ఓ సర్వే నిగ్గు తేల్చింది. పాత గాడ్జెట్‌ల నుంచి బంగారాన్ని వెలికితీసేందుకు అనుసరిస్తోన్న ప్రస్తుత పద్ధతలు చాలా ప్రమాదంతో కూడుకుని ఉన్నాయని బ్రిటన్‌కు చెందిన ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. 
పాత పద్ధతుల్లో భాగంగా ఫోన్‌ల నుంచి బంగారాన్ని సేకరించేందుకు cyanide వంటి ప్రమాదక కెమికల్స్‌ను వాడవల్సి ఉంటుందని వీరు చెబుతున్నారు. సైనైడ్ వంటి కెమికల్స్ మనిషి ఆరోగ్యానికి చాలా హానీ కలిగిస్తాయి. వీటిలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలు కోల్పొవటం తద్యం. 

భవిష్యత్‌లో ఇటువంటి టాక్సిక్ కెమికల్స్ జోలికి పోకుండా సాధారణ వెలికితీత పద్ధతుల ద్వారా బంగారాన్ని సేకరించేందుకు సరికొత్త మార్గాన్ని కొనుగొన్నట్లు ఎడిన్బర్గ్ స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ జాసన్ లవ్ తెలిపారు. రసాయన శాస్త్రం ఆధారంగా కొనగొనబడిన సరికొత్త కాంపౌండ్ ద్వారా ఎటువంటి ప్రమాదం లేకుండా గాడ్జెట్‌లను నుంచి బంగారం వంటి విలువైన లోహాలను వెలికితీయవచ్చని శాస్తవేత్తలు చెబుతున్నారు.
ఈ పద్ధతిలో భాగంగా ముందుగా ఆయా గాడ్జెట్‌లకు సంబంధించిన ప్రింటెండ్ సర్క్యూడ్ బోర్డ్‌లను తేలికపాటి యాసిడ్‌లో ఉంచుతారు. ఈ యాసిడ్ సర్క్యూడ్ బోర్డ్‌లోని అన్ని లోహపు భాగాలను కరిగిస్తుంది. ఇప్పుడు శాస్త్రవేత్తలు రూపొందించిన ప్రత్యేకమైన కెమికల్ కాంపౌండ్ సహాయంతో కరిగిన ధ్రవం నుంచి బంగారం వంటి విలువైన లోహాలను వేరు చేస్తారు.

loading...