News and Entertainment

“100 రూపాయలతో లక్షాధికారి కావడం ఎలా?” బిల్ గేట్స్ చెప్పిన జీవిత సత్యం.!




మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నారా? పెట్టుబడికి తగ్గ డబ్బులు లేవా? అప్పుకోసం ట్రై చేస్తున్నారా? అయితే వ్యాపారాన్ని స్టార్ట్ చేయడానికి ఇవ్వన్నీ అవసరం లేదంటున్నాడు  బిల్ గేట్స్. కష్టపడే తత్త్వానికి  కాస్తంత టెక్నిక్ ను  జోడిస్తే ….ఏడాది తిరకుండానే లక్షాధికారులు కావొచ్చు అంటున్నాడీ   సాఫ్ట్ వేర్ మాంత్రికుడు. దేశంలోనే సంపన్నులలో ఒకడైన బిల్ గేట్స్ ….ఓ ఇంటర్వ్యూ లో అడిగిన ప్రశ్నకు అతనిచ్చిన సమాధానం వింటే….నిజంగా  ఆలోచించే విధానం ఉండాలే కానీ డబ్బును సంపాదించడం ఏమంత విషయం కాదని కుండబద్దలు కొట్టినట్టు అర్థం అవుతుంది.

ఇంటర్వ్యూ లో అడిగిన ప్రశ్న: మీ దగ్గర 100 రూపాయలుంటే….వాటితో ఎందులో పెట్టుబడి పెడతారు? ఎంత లాభాన్ని ఆర్జిస్తారు?

బిల్ గేట్స్ సమాధానం: నా దగ్గర 100 రూపాయలు ఉంటే….మొదటగా ఓ మంచి కోడిపెట్టను కొంటాను… 3 నెలల్లో…ఆ కోడిపెట్ట….8-10 పిల్లలకు జన్మనిస్తుంది. ఇంకో రెండున్నర నెలలు గడిచేసరికి… కోడి పిల్లలు కూడా పెద్దవై  పిల్లల్ని పెట్టడం స్టార్ట్ చేస్తాయి. అలా 6 నెలల తర్వాత ఫస్ట్ ఇన్ కమ్ లెక్కేసుకుంటే…. 10*600 (ఒక్క కోడి రెండు కిలోల బరువుగా,  కిలో ధర  300 గా వేసుకుంటే…..) 6000 రూపాయలు  వస్తాయి. ఆ డబ్బులతోనే ఇంకొన్ని లేయర్ ( గుడ్లు పెట్టే కోళ్ల) ను కూడా కొంటాను. ఇప్పుడు  ప్రతిరోజు కోడి పెట్టే గుడ్లను అమ్మడం తో డబ్బులు వస్తుంటాయి…దానికి తోడు నా దగ్గరున్న కోళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంటాయి.! ఇలా ఓ 100 కోళ్లను ఓ ఎడాది పాటు  మెంయింటేన్ చేసుకుంటూ పోతే…..4 సార్లలో…. 3 సార్లు 100*600*3= 1.8 లక్షలు సంపాదించొచ్చు ( కోడిగుడ్ల నుండి సంపాధించే డబ్బులు అధనం). పూర్తిగా కోళ్లనే చూసుకోకుండా నేను వేరే పని చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి అక్కడి నుండి కూడా నేనే సంపాదించే అవకాశం ఉంటుంది.

Note: కోళ్ల పెపంకం నిజంగా ఓ మంచి ఇన్ కమ్ సోర్సే….ఊర్లలో అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. నాటుకోడి మాంసానికి, గుడ్లకు కూడా ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇంత డిమాండ్ ఉన్న కోళ్ల పెంపకాన్ని సైడ్ బిజినెస్ గా చేసుకుంటే….పల్లెల్లోని చాలా కుటుంబాలు బాగుపడొచ్చు. గతంలో ఊర్లలోని చాలా ఇళ్లలో కోళ్ల గూళ్లు ఉండేవి…ఇంటికి రెండు, మూడు కోళ్లను ఖచ్చితంగా పెంచేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.


కొసమెరుపు: కోట్లకు కోట్ల ఆస్తి ఉన్న బిల్ గేట్స్ కూడా కోళ్ళ వ్యాపారం చేస్తున్నాడు. కోడి గుడ్డును పొడిగా చేసి అమ్మే సంస్థను స్థాపించాడు తన ఆస్థిని పెంచుకునే పనిలో బిజీగా ఉన్నాడు  బిల్ గేట్స్.