News and Entertainment

జియో వినియోగదారులకు షాకింగ్‌ న్యూస్‌


రిలయన్స్‌ జియో స్టార్టింగ్‌ ఆఫర్స్‌ను ఎంజాయ్‌ చేస్తున్న వినియోగదారులకు బ్యాడ్‌ న్యూస్‌. డిసెంబర్‌ 31 వరకు అన్‌ లిమిటెడ్‌ కాల్స్‌ మరియు డేటాను వినియోగించుకోవచ్చు అని ఆశిస్తున్న వారికి ఈ వార్త మింగుడు పడటం లేదు. ముఖేష్‌ అంబానీ జియో ప్రారంభం సందర్బంగా మాట్లాడుతూ డిసెంబర్‌ 31 వరకు ఉచిత ఆఫర్స్‌ అందుబాటులో ఉంటాయి అని ప్రకటించాడు. అయితే ట్రాయ్‌కు జియో తెలిపిన ప్రకారం 90 రోజులు మాత్రమే ఉచిత ఆఫర్స్‌ ఇస్తుందట.


ట్రాయ్‌కు తాజాగా ఇతర టెలికాం సంస్థలు ఫిర్యాదు మేరకు ఈ వివరాలను వెళ్లడి చేసింది. జియో ఆఫర్‌ కేవలం 90 రోజులు మాత్రమే అని, ఆ తర్వాత ఇతర టెలికాం సంస్థల మాదిరిగానే వినియోగదారుల నుండి వసూళ్లు చేయాల్సిందే అని ట్రాయ్‌ సదరు సంస్థలతో పేర్కొంది. ఇక ట్రాయ్‌ చెబుతున్న దాని ప్రకారం 90 రోజులు మాత్రమే అంటే డిసెంబర్‌ 3తో ఆ గడువు పూర్తి కానుంది. డిసెంబర్‌ 4 నుండి రిలయన్స్‌ జియో సాదారణ రేట్లను అమలు చేయాల్సిందే. దాంతో ఉచిత ఆఫర్లు వాడుతున్న జియో వినియోగదారులు డిసెంబర్‌ 4 నుండి రీచార్జ్‌లు చేయించుకోవాల్సిందే.