News and Entertainment

రండి బాబు రండి మీకు నచ్చిన అమ్మాయిలను కొనుక్కోండి అంటూ అమ్మాయిలను బజార్లలో అమ్ముతున్నారు ఎక్కడో ఎందుకో తెలుసా ?


పశువుల సంతలో ఆవులనో, గేదెలనో అమ్మినట్టు అమ్మాయిలను అమ్ముతున్నారు చైనా బజార్లలో. వారిని కొనుక్కోవడానికి అబ్బాయిలు కూడా విపరీతంగా ఎగబడుతున్నారు. వారు ఆ అమ్మాయిలను కొనుక్కుంటున్నది బానిసలను చేసుకోవడానికో, శృంగార కోరికలు తీర్చుకోవడానికో కాదు.. లక్షణంగా పెళ్లి చేసుకోవడానికి. అవును.. స్వదేశంలో అమ్మాయిల కొరత ఏర్పడడంతో చైనా యువకులు వియత్నాం యువతులను వివాహమాడడానికి సిద్ధపడి ఇలా బజార్ల వెంట తిరుగుతున్నారు. అయినా చైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎందుకంటే తప్పంతా ప్రభుత్వానిదే కదా.

కొన్ని రోజుల కిందటి వరకు చైనాలో ఒకే సంతానం విధానం కఠినంగా అమలు జరిపేవారు. అలాగే చైనా దంపతులు తమ ఏకైక సంతానంగా మగబిడ్డనే కోరుకునే వారు. ఆడపిల్లని తేలితే నిర్దాక్షణ్యంగా గర్భస్రావం చేయించుకునే వారు. రెండోసారి ఆడపిల్లను కనడానికి అవకాశం లేదు. దీంతో చైనాలో స్త్రీ పురుష నిష్పత్తి గణనీయంగా పడిపోయింది. ఇప్పుడు ఉన్న చైనా అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలంటే మాటలతో పని కాదు. సంఖ్యాపరంగా తక్కువగా ఉండడం వల్ల వారికి విపరీతంగా డిమాండ్‌ పెరిగింది. చైనా యువతులను పెళ్లి చేసుకోవాలనుకునేవారు భారీగా ఎదురు కట్నం ఇచ్చి, పెళ్లి ఖర్చులు కూడా పెట్టుకోవాలి. అలాగే పెళ్లి కుమారుడికి పెద్ద ఉద్యోగం, స్వంత ఇల్లు తప్పనిసరి. అందుకే ఇవేవీ లేని వారు వియత్నాం నుంచి అక్రమ రవాణా అయిన అమ్మాయిలను రూ.2 లక్షల నుంచి 5 లక్షల వరకు వెచ్చించి కొనుక్కుంటున్నారు.


చైనాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వియత్నాం అమ్మాయిలకు వల వేస్తున్నారు స్మగ్లర్లు. ఇక్కడ మార్కెట్లో ఆ అమ్మాయిలను లక్షలకు అమ్మేసి వారికి నయాపైసా కూడా ఇవ్వకుండా డబ్బు చేసుకుంటున్నారు. అలా అమ్ముడుపోయిన అమ్మాయిలు, కన్న తల్లిదండ్రులను, మాతృదేశాన్ని విడిచి ఎవరో ముక్కూ, మొహం తెలియని వ్యక్తితో కాపురం చేయాలి. అక్కడి వియత్నాంలోని వారి తల్లిదండ్రులకు కూడా అసలు విషయం తెలియదు. ఇలా ఎంతోమంది వియత్నాం యువతులు చైనాలో మగ్గుతున్నారు.