News and Entertainment

అసలు దసరా పండుగను జరుపుకోవడములో గల వాస్తవ ఆంతర్యము ఏమిటి ?


మనుషులు గత జన్మ కర్మ ఫలితముగా వ్యాధి రూపేణా, ఋణ రూపేణా, శత్రు రూపేణా భాధపడుతూ ఉంటారనేది శాస్త్రము చెబుతుంది. ఆ విధముగా కర్మ జీవులైన మానవులు జన్మను తీసుకున్నాక గత జన్మ స్ర్ముతులను మరచి తిరిగి మరలా మరలా పాపాలు చేస్తూ ఉంటారు. ఆయా పాప కర్మలను అనుసరించి వారిని తగిన విధముగా అనారోగ్యపరంగానో, శత్రు రూపములోనో, లేక మృత్యురూపంలోనో సమస్యలను సృష్టించి శిక్షించడానికి ఆయా సమయములలో యమ ధర్మ రాజు ఉపక్రమించడము జరుగుతుంది .

ఈ విధంగా జీవులను తగిన విధంగా శిక్షించడానికి ఉపక్రమించిన యమ ధర్మరాజుకి

ఒకవైపు కోర (దంతము) శరదృతువు లో అశ్వియుజ శుద్ద పాడ్యమి తిధి నుండి నవమి వరకు గల సమయములో బయటకు రావడము జరుగుతుంది.
రెండవ కోర చైత్ర మాసం ప్రారంభములో ఉన్న 9 రోజులలో వస్తుందని శాస్త్ర ఉవాచ
అది మొదలు ఈ సమయంలో ప్రపంచములోని అన్నీ ప్రదేశములలో అంతుతెలియని లేదా తీవ్రమైన అంటు వ్యాధులు ప్రభలీల్లడము, లేదా అనుకోని సమస్యలు శత్రువుల వలన ఏర్పడటము జరిగి ప్రజలు నానా అనారోగ్యముల పాలై తీవ్రమైన భాధలను అనుభవించడము, అందులో కొందరు మరణాలను కూడా పొందడము జరుగుతుంది.
(మనం గమనించి నట్లైతే ప్రతి సంవత్సరము కూడా మిగతా రోజులతో పోలిస్తే ఈ రోజులలో యాక్సిడెంట్స్ ద్వారా గాని, వ్యాధుల ద్వారా గాని జరిగే మరణాల సంఖ్య ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి. మీరు గమనించవచ్చు.)

అందువలన ఈ సమయంలో అమ్మవారిని శాస్త్రోక్తంగా పూజించి అర్చించి ఉపాసనాది అనుష్టానములను నిర్వహించడము ద్వారా ఆయా దోషముల నుండి విముక్తి కల్గి ఋణ, రోగ, శత్రు భాధలనుండి బయట పడుటకు అవకాశము కలదు .

అంతేకాకుండా ఉపాసనకు ఒక రోజులో అత్యంత ముఖ్యమైన లేదా ఉత్క్రుష్టమైన కాలము ఏమిటంటే అది బ్రాహ్మీ ముహూర్త కాలము ,అనగా సూర్యోదయమునకు 48 నిముషముల ముందు సమయము .

సంవత్సరమునంతా కూడా ఒక రోజుగా భావన చేసి నట్లైతే ఈ శరదృతువులో వస్తున్న అశ్వియుజ శుద్ద పాడ్యమి తిధి నుండి నవమి వరకు గల సమయము బ్రాహ్మీ ముహూర్తము అవుతుంది. అనగా ఒక సంవత్సరానికి మొత్తం కూడా తెల్లవారు ఝాము లేదా బ్రాహ్మీ ముహూర్త కాలము ఏమిటంటే అది దేవి నవరాత్రుల కాలము అని చెప్పవచ్చు .

అందువలన ఈ సమయము లో చేయు అన్నీ రకములైన అనుష్టానములు, జపములు, ఉపాసనలు త్వరగా ఫలించి సిద్దించుటకు అవకాశం ఉన్నది.

అంతే కాకుండా జ్యోతిషపరంగా గనుక మనం గమనించి నట్లైతే ఈ సమయం లో ఆత్మ కారకుడు అయిన సూర్య భగవానుడు కన్యా రాశి లో సంచారము చేస్తూ ఉంటాడు ఈ కన్యా రాశ్యాధిపతి అయిన బుధుడు జ్ఞానమునకు, మంత్రసిద్దికి, విధ్యకు కారకుడు.
కావున రాశి చక్రం ప్రకారము సహజ పంచమాధిపతి (జ్ఞానము,మంత్రసిద్ది) అయిన రవి సహజ ఋణ, రోగ, శతృ క్షేత్రమైన కన్య లోకి ప్రవేశము చేయడము వలన గత జన్మ పుణ్యము తగ్గిపోవడము వలన జ్ఞానము నశించి చిన్న చిన్న విషయాలకే కలత చెందుతూ అనారోగ్యములకు గురై తద్వారా తీసుకున్న నిర్ణయాల వలన శత్రువులను పెంచుకోవడమువలన శాంతిని, సుఖమును కోల్పోవడము జరుగుతుంది .

అయితే ఈ సమయములో సరియైన గురువును ఆశ్రయించి తగిన విధముగా అర్హతను బట్టి మంత్రము నో లేదా తగు సలహనో పొండటము ద్వారా దైవారాధన చేయడము, అవకాశము ఉన్నంతలో నిజంగా అవసరం ఉన్న వారికి తగిన విధముగా సహాయ, సహకారములను అందించడము వలన పుణ్య బలము పెరిగి జ్ఞానము కల్గి చేయు పనులలో ఆటంకములు తొలగి, సంపూర్ణ ఆయుర్ ఆరోగ్యములను పొందే అవకాశము ఉంటుంది.
మీరు గమనించి నట్లైతే ఈ సమయములో సమాజములో చర్మ, లివరు, గాల్ బ్లాడర్, జీర్ణాశయ, ఉదర సమస్యలు, మరియు తీవ్రమైన లేదా ప్రాణాంతకమైన జ్వరాలు, విసర్జనావయములకు సంభందించిన సమస్యలు రావడము వలన ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశము ఉంది. లేదా ఇప్పటికే ఆయా సమస్యలను ఎదుర్కొనే వారికి అవి మరి కొంత పెరిగి ఇబ్బంది పెట్టె అవకాశము ఉన్నది.

మరికొంత మంది తాము చేస్తున్న పని విషయం లో సహచరుల వలన ఆటంకాలు ఎదురవడము లేదా వారి వలన సకాలములలో ఆయా పనులు కాక అవస్తలు పడే అవకాశము ఉన్నది.

మరొక అశ్చర్యకరమైన అంశము ఏమిటంటే అమ్మవారికి సంభందించిన ఈ వ్యాసము చదువుతున్న సమయములో మీ శరీరము మీద లేదా సమీపములో ఎరుపు లేదా బులుగు రంగుకు సంభందించిన ఛాయలు (షేడ్స్) కల్గిన రంగులను మీరు గమనిస్తారు .