News and Entertainment

శోభనంకు వారి సలహాలు వద్దు


ప్రతి యువతి, యువకుడిలో కూడా శోభనం అనగానే ఎన్నో ఆలోచనలు మరెంతో ఆతృత ఉంటుంది. అయితే ఆతృతతో శోభనంకు రెడీ అవ్వడం వల్ల అనుకున్నట్లుగా అన్ని చేయలేక పోగా, తీవ్ర నిరుత్సాహ పడాల్సి వస్తుంది. ఇక శోభనంకు ముందు స్నేహితుల సలహాలు సూచనలు, వారి అనుభవాలు తెలుసుకుంటూ ఉంటారు. అయితే స్నేహితులు ఏ ఒక్కరు కూడా శోభనం విషయంలో నిజం చెబుతారు అనే నమ్మకం లేదు. పరువు కోసం అయినా తమ శోభనం రాత్రి దుమ్ము రేపాము అంటూ చెబుతారు.


శోభనం రాత్రి అలా చేయాలి, ఇలా చేయాలి, స్పీడ్‌గా ఉండాలి, ఆమెను డామినెట్‌ చేయాలి అంటూ స్నేహితులు సలహాలు ఇస్తూ ఉంటారు. అవన్ని పట్టించుకుంటే శోభనం గదిలో అట్టర్‌ ఫ్లాప్‌ అవ్వడం ఖాయం. శోభనంకు ముందు పెద్ద వారు అంటే తాత వయస్సులో ఉన్న వారితో మాట్లాడితే మంచిది. వారి సలహాలు మరియు సూచనలు తీసుకుని శోభనంకు సిద్దం అవ్వాలి. తాత వయస్సు ఉన్న వారు ఎక్కువగా ఉన్న వాస్తవాలు చెబుతారు. వారి అనుభవంను బట్టి శోభనం రాత్రి ఎలా ఉండాలో వివరిస్తారు. అలా వారి సలహాలు తీసుకుని, వారు చెప్పినట్లుగా చేస్తే తప్పకుండా శోభనం గదిలో విజయం సాధించక పోయినా, అట్టర్‌ ఫ్లాప్‌ అయితే కారు అని చెప్పవచ్చు.