News and Entertainment

టీవీ చూస్తే పిల్ల‌లు పుట్ట‌ర‌ట‌



మ‌న‌కు ఉద‌యం నిద్ర లేచిన‌ద‌గ్గ‌ర నుంచి నిద్ర‌పోయే వ‌ర‌కు టీవీ లేనిదే అస్స‌లు ఉండ‌లేం. న్యూస్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, సినిమాలు, స్పోర్ట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్ర‌తి స‌మాచారం..ఇంకా తాజా తాజా లైవ్ అప్‌వేట్స్ వీట‌న్నింటి కోసం టీవీ మీదే ఆధార‌ప‌డ‌తాం. లేడీస్ అయిఏ ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు సీరియ‌ల్స్ కోసం టీవీల‌కు అతుక్కుపోయి మ‌రీ చూస్తుంటారు.
అయితే ఇప్పుడు టీవీల‌కు సంబంధించి ఓ షాకింగ్ వార్త బయటకు వచ్చింది. నిత్యం మీరు టీవీ చూస్తుంటే కోల్పోయేది ఏంటో తెలుసా?. వింటే షాక్ అవ్వాల్సిందే. కొత్తగా పెళ్లైన వారు నిత్యం టీవీ చూస్తూ కూర్చుంటే వాళ్లకు పిల్లలు పుట్టే అవకాశం రోజు రోజుకు త‌గ్గిపోతుంద‌ట‌.

తాజాగా డెన్మార్క్‌లోని కోపెన్ హాగెన్ యూనివర్శిటీ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. రోజుకు ఐదు గంటల కంటే ఎక్కువగా టీవీ చూసే పురుషుల్లో శక్రకణాల సంఖ్యపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని వారి తాజా ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. శుక్రకణాల సంఖ్య తగ్గడం వల్ల పిల్లలు పుట్టే యోగం తప్పిపోయే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరించారు.


పరిశోధకులు 1200 మంది యువకులను పరిశీలించగా ఈ విషయం వెలుగు చూసింది. టీవీ ఎక్కువగా చూడని వారిలో శుక్రకణాల సంఖ్య మిల్లీమీటరుకు 5.2 కోట్లుండగా, టీవీ ఎక్కువగా చూసే వారిలో సగటున 3.7 కోట్ల శుక్రకణాలే ఉన్నాయని పరిశోధకుల పరిశోధనలో వెల్లడైంది. వీర్య ఉత్పత్తికి తోడ్పడే పురుష హార్మోన్ టెస్టో స్టెరాన్ స్థాయి కూడా తక్కువగా ఉందని పరీక్షలో వెల్లడైంది. సో యువ‌కులు ఇప్ప‌టికైనా ఎక్కువ‌గా టీవీల‌కు అతుక్కుపోవ‌డం మంచిది కాద‌ని దీనిని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.