News and Entertainment

భార్యాభర్తలు బెడ్ రూమ్ లో ఇలా మాత్రం ఉండకండి... అలా ఉంటే పొరపాటే..


ఎగరడం నేర్పక్కరలేదన్నట్టుగానే భర్తను ముగ్గులోకి దించడం భార్యకు చెప్పాల్సిన అవసరం లేదని చాలామంది అనుకుంటారు. కానీ అది శుద్ధ తప్పు అంటున్నారు నిపుణులు.
ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు రాత్రి కూడా యాంత్రికంగా గడిచిపోతే ఇక వారికి థ్రిల్ ఏం ఉంటుంది? ఆ రకంగా చూస్తే భార్యాభర్తలకు దొరికే ప్రైవసీ తక్కువే. బెడ్రూమ్లో కనీసం ఏడు గంటల సమయం దొరికిందనుకుందాం. లిటరల్‌గా నిద్ర సమయం ఐదు గంటలే. అందుకే ఇప్పుడు సెక్స్‌కి కూడా ప్లానింగ్ ఉండాలి.

మనబోటి దేశాల్లో స్త్రీలు ఎంత చదువుకున్నా చొరవ చేయలేరు. అందుకే మన గుడ్ గాళ్స్‌కి చొరవ పెరగాలంటున్నారు నిపుణులు.

బెడ్రూమ్లో శృంగార వాతావరణానికి ముందస్తు టిప్స్ చెబుతున్నారు. మగవాళ్ళలో చాలామంది ఫోర్ ప్లేకి సిద్ధపడరు. నేరుగా తమకు కావాల్సింది తీసుకోవడానికే సిద్ధపడిపోతారు. అందుకే ఎక్కువ ఫోర్ ప్లే చేసేందుకు మన గుడ్ గాళ్స్ వారిని ప్రోత్సహించాలి.

ఆ సమయంలో మాటలు గోముగా, మత్తుగా, గుసగుసగా వస్తాయి కాబట్టి, అసలు విషయం కొంచెం ఆలస్యంగా మొదలెట్టేందుకు కాసేపు ఇలాగే చేద్దాం, ఇలాగే బాగుంది...ఊ...! అంటూ ఊతమివ్వమంటున్నారు.
వారిలో కంగారు తగ్గించి, ఓర్పు పెంచడానికి సహకరిస్తే, మెల్లిగా శృంగారంలో ఇద్దరికీ సాఫ్ట్ స్కిల్స్ అలవడతాయట.

రోజూ ఫోర్ ప్లే చేయడం వల్ల ఒకరి శరీరానికి మరొకరు బాగా అలవాటు పడతారు. శరీర స్పర్శ బాగా అలవాటైతే, ఎక్కువసేపు సెక్స్‌లో పాల్గొంటారు. క్రమంగా ఆ టైం పెంచుకుంటే అతడితో సమానంగా ఆమెకీ సంతృప్తి లభిస్తుంది.

సెక్స్ పూర్తయ్యాక చెరోవైపు తిరిగి పడుకోవడం పెద్ద రాంగ్‌స్టెప్ అంటున్నారు నిపుణులు. ఫోర్‌ప్లే వల్ల ప్రేమానురాగాలు పెరుగుతాయి. కౌగిలి స్పర్శను ఎక్కువసేపు ఆస్వాదిస్తే మళ్ళీ రాత్రివరకు ఆగగలుగుతారు. వీలైతే ఆ భంగిమలోనే నిద్రలోకి జారిపోవడం మరీమంచిది. దీనివల్ల నిత్యజీవితంలో, సంభాషణల్లో వారి మధ్య ప్రేమ రెట్టింపు అవుతుందట.


ఇదంత నిపుణులు తెలిపిన అంశాలు మాత్రమే.... మేము సుఖం గానే ఉన్నాం అనుకునేవాళ్ళు అంతగా పట్టించుకోవలసిన అవసరం లేదులెండి. ఏమైనా ఇద్దరు ఒకరికి ఒకరు అర్థం చేసుకోవటం వల్ల లాభాలు చాలా ఉన్నాయి. అర్థ వంతమైన జీవితం సుఖం గా ఉంటది. అపార్థాలకి స్థానం కల్పించకండి. అల్ ది బెస్ట్.