News and Entertainment

చిరిగిన దుస్తులు, ఎండిన పువ్వులు ఇంట్లో ఉంటే మీ ఇంటికి మహాలక్ష్మి రాదు


వాస్తు ప్రకారం చిరిగిన దుస్తులను వాడటం.. ఎండిన పువ్వుల్ని అలాగే వుంచడం ద్వారా మీ ఇంటికి మహాలక్ష్మి రాకను నిరోధించినట్లవుతుంది.

అందుచేత వాస్తు నిపుణుల సలహా మేరకు పటాలకు వేసిన పువ్వులు వాడిపోయిన వెంటనే తీసిపారేయడం చేయాలి. అలాగే చిరిగిన దుస్తుల్ని వాడటం మానేయాలి. చిరిగిన దుస్తుల్ని కుట్టి ధరించడం చేయాలి. లేకుంటే వాటిని వాడకుండా ఉండటం మంచిది.

ఇకపోతే.. లివింగ్ రూమ్‌‌ దక్షిణ గోడకు వెలుతురుతో కూడిన బొమ్మను ఉంచితే సానుకూల ఫలితాలుంటాయి. మీ పడకగదిలో గాలి దక్షిణం నుండి పశ్చిమాన వీచే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. కిచెన్లో అద్దాలుండకుండా చూసుకోవాలి. బాత్రూమ్లను ఎప్పుడూ మూతపెట్టే వుంచాలి.


లివింగ్ రూమ్లో ఆహ్లాదకరమైన సీనరీలు, ఫోటోలో ఉపయోగించాలి. మీ ఇంటి భవనంలోని గదులు ఓవల్, సర్కిల్, ట్రైయాంగిల్ ఆకారంలో ఉండకుండా చూసుకోవాలి. అలాగే మీ ఆఫీసుల్లో మీ వెనుక కొండలతో కూడిన వాల్ పేపర్లను ఏర్పాటు చేసుకోవడం మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.