News and Entertainment

దంపతులకు శుభవార్త.. ఇక కండోమ్ వాడాల్సిన అవసరం లేదట!


ప్రస్తుతమున్న రోజుల్లో పురుషులు గర్భనిరోధక పద్ధతులు పాటించాలంటే ఉన్న మార్గాలు రెండే.ఒకటి శాశ్వతంగా అయితే వాసెక్టమీ చేయించుకోవడం, తాత్కాలికంగా అయితే కండోమ్‌లు వాడటం. అయితే, కండోమ్‌లు వాడుతున్నా కూడా 18 శాతం కేసుల్లో వాళ్ల భాగస్వాములు గర్భం దాలుస్తున్నట్లు శాస్త్రీయ ఆధారాలున్నాయి.కాని కొన్నాళ్లపాటు గర్భం రాకుండా ఉండేందుకు ప్రస్తుతం సురక్షిత విధానం అన్నది ఇంతవరకు లేదు.

ఇప్పుడు కండోమ్స్‌కు స్వస్తి చెప్పే కొత్త విధానం మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది.వాసాజెల్ అనే ఇంజెక్షన్ ఒక్కసారి తీసుకుంటే చాలు ఏడాది పాటు కండోమ్‌లు వాడాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.మగ కుందేళ్లపై పరీక్షలు జరిపిన శాస్త్రవేత్తలు అందులో సక్సెస్ అయ్యారు.ఆ కుందేలుకు ఏడాది పాటు సంతానం కలగలేదు.ఈ ఇంజెక్షన్‌కు ఉన్న హైడ్రోజెల్ లక్షణాల కారణంగా ఇది సుదీర్ఘకాలం పాటు గర్భనిరోధకంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఈ ఏడాది చివర్లో మనుషులపై ప్రయోగాలు జరుగుతాయని అంటున్నారు.