News and Entertainment

దీపావ‌ళికి ముందు వారం పాటు ఇలా చేస్తే… ల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హిస్తుంద‌ట‌..!


ద‌స‌రా పండుగ‌ఎప్ప‌టిలా రానే వ‌చ్చింది. అంద‌రూ హ్యాపీగా ఈ పండుగ‌ను జ‌రుపుకున్నారు. పండుగ కాస్తా అయిపోయాక ఇప్పుడు మ‌ళ్లీ అంద‌రూ సిటీ బాట ప‌డుతున్నారు. కానీ మ‌రో 15 రోజుల్లో మ‌రో పండుగ జ‌నాల‌కు సంతోషాల‌ను తెచ్చేందుకు సిద్ధంగా ఉంది. అదే దీపావ‌ళి. దీపావ‌ళి అన‌గానే సాధార‌ణంగా అంద‌రికీ ట‌పాకాయ‌లే గుర్తుకు వ‌స్తాయి. కానీ ఆ రోజు చాలా మంది ల‌క్ష్మీ పూజ కూడా చేస్తారు. దీపావ‌ళి వెలుగు దివ్వెల్లాగే త‌మ జీవితాల్లోనూ సుఖ సంతోషాలు నిండాల‌ని, అష్టైశ్వ‌రాలు క‌ల‌గాల‌ని అంద‌రూ ల‌క్ష్మీ దేవిని ప్రార్థిస్తారు. అయితే కేవలం ఆ రోజే కాకుండా దానికి ముందు వారం పాటు ల‌క్ష్మీ దేవిని పూజించాల‌ట‌. కానీ పూలు, పండ్లు, అర్చ‌న‌ల‌తో కాదు, కేవ‌లం పాల‌తో ఆ దేవిని పూజించాల‌ట‌. అదేంటీ వింత‌గా, ఆశ్చర్యంగా ఉంది, అనుకుంటున్నారా..? అయినా మీరు వింటోంది క‌రెక్టే. ఇంత‌కీ పాల‌తో ల‌క్ష్మీ దేవిని ఎలా పూజించాలో, దాని వ‌ల్ల ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

దీపావ‌ళికి స‌రిగ్గా వారం ముంద‌ట ఒక రోజు సాయంత్రం పూట ఒక లీట‌రు పాల‌ను కొని తేవాలి. దాంట్లో కొద్దిగా తేనె, గంగాజ‌లం (శుద్ధ‌మైన మంచినీరు) క‌ల‌పాలి. అనంత‌రం వ‌చ్చే మిశ్ర‌మాన్ని రెండు భాగాలు చేయాలి. ఒక భాగంతో స్నానం ఆచ‌రించాలి. మ‌రో భాగాన్ని తీసుకుని అందులోని మిశ్ర‌మాన్ని ఇంటి క‌ప్పు మీద‌, ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద‌, ఇత‌ర గ‌దుల్లో చిల‌క‌రించిన‌ట్టు చ‌ల్లాలి. అందులో కొంత మిశ్ర‌మాన్ని మిగిలించి దాన్ని మ‌ళ్లీ ప్ర‌ధాన ద్వారం ప‌క్కన పార‌బోయాలి. ఇలా దీపావ‌ళికి వారం ముందు నుంచి దీపావ‌ళి వ‌చ్చే వ‌ర‌కు చేయాల్సి ఉంటుంది. దీంతో అనేక శుభ ఫ‌లితాలు క‌లుగుతాయి.


పైన చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల ల‌క్ష్మీ దేవిని పూజించిన‌ట్టు అవుతుంద‌ట‌. దీంతో అలా చేసిన వారి ఇంట్లో నెగెటివ్ శ‌క్తి పోయి, పాజిటివ్ శ‌క్తి వ‌స్తుంద‌ట‌. ఇంట్లో అంద‌రికీ అంతా శుభ‌మే క‌లుగుతుంద‌ట‌. ధ‌నం బాగా స‌మ‌కూరుతుంద‌ట‌. వారిని లక్ష్మీ దేవి అనుగ్ర‌హించి అన్ని సంప‌ద‌ల‌ను ఇస్తుంద‌ట‌. ధ‌నం లేని వారికి ధ‌నం ఇస్తే, అది ఉన్న వారికి శుభ ఫ‌లితాల‌ను క‌లిగిస్తుంద‌ట‌.