News and Entertainment

ల్యాప్ టాప్ బుక్ చేస్తే.. చెక్క ముక్కొచ్చింది..


కరీంనగర్ జిల్లాలో మరో ఆన్ లైన్ షాపింగ్ మోసం వెలుగు చూసింది. 34 వేల రూపాయలతో లాప్ టాప్ కోసం ఆర్డర్ చేసిన ఓ వ్యక్తికి రెండు పుస్తకాలు, ప్లై ఉడ్ చేతికి వచ్చాయి. జమ్మికుంటకి చెందిన మామిడాల శ్రీధర్
ఈనెల 2న ఆన్ లైన్ లో ల్యాప్ టాప్ కు ఆర్డర్ ఇచ్చారు. క్యాష్ ఆన్ డెలివరీలో కొరియర్ బాయ్ కు 34 వేలు ఇచ్చి…. ప్యాకెట్ తీసుకున్నారు. దాన్ని ఓపెన్ చేస్తుండగాకుటుంబసభ్యులు మొత్తం వీడియో రికార్డు చేశారు.


తీరా ప్యాకెట్ లో ఓ పుస్తకం, పెద్ద చెక్కముక్క కనిపించడంతోఅవాక్కయ్యారు. మరోవైపు కొరియర్ బాయ్ అని అడిగితే.. తనకేం తెలియదని సమాధానమిచ్చాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు శ్రీధర్. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.