News and Entertainment

గ్రహాల ద్వారా కూడా అనారోగ్యాలు వస్తాయా...మరి అవి పోవాలంటె?


గ్రహాల దుష్టకిరణాల ద్వారా వ్యక్తిలో ఏర్పడే శారీరక, మానసిక రుగ్మతలకు గ్రహాల మంచి కిరణాల ద్వా రా వృద్ధి చెందిన వృక్ష జాతులు ఔషధాలవుతాయి అనేది జ్యోతిర్వైద్య సిద్ధాం తం. వ్యక్తి తగిన ఆహారాన్ని తీసుకోవాలి అని భగవద్గీత వచనం. ఆయుర్వేద సిద్ధాంతం జ్యోతిశ్శాస్త్ర సంప్రదాయం ఉపనిషోద్ఘోష. .ఈ తగిన అనే పదం చాలా విలువ కలిగి ఉంది. వేదాంతపరంగా మితమైన సాత్వికాహారం ఆయుర్వేదపరంగా వ్యక్తి శరీరానికి తగిన పౌష్టికాహారం అనే అర్థాలు చెప్పినా జ్యోతిర్వైద్యపరంగా వ్యక్తి దశకు గ్రహమిచ్చిన లోపాన్ని పూరించే ఆహారమని చెప్పాల్సి ఉంది. ఈ కోణంలో ఆలోచన చేసినప్పుడు జ్యోతిర్వైద్యం ఆయుర్వేదం కంటే భిన్నమైన సమగ్రతను, ప్రత్యేకతను నిలుపుకుంటోంది.

భాస్కర
ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్ అనే సంప్రదాయం ప్రసిద్ధమైనది. వాస్తు శాస్త్ర విద్య ఈశాన్యాన ఉన్న నుయ్యి, తూర్పున ఉన్న స్నానగృహం, ఇంట్లో ఈశాన్యాన ఉన్న పూజాగృహం, ఆగ్నేయాన ఉన్న వంటిల్లు బాలభానుని లేతకిరణాల వల్ల ఆరోగ్యాన్ని పెంచుతాయి. సౌర స్నానాల పేరిట ఆరోగ్యం సాధిస్తున్నారు. ఉదయకాంతి శరీర ఆరోగ్యానికి చాలా మంచిదని కొత్త వైద్య ప్రక్రియ కూడా రూపొందుతున్నది. ఉదయాన సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, ఉదయకాలపు నడక ఆరోగ్యవంతుల మంచి అలవాట్లు. సూర్యుని కాంతిని ప్రత్యేక అద్దం ద్వారా అనారోగ్య ప్రదేశంలో ప్రసరింపజేసి ఆనారోగ్యాన్ని నివారించే పద్ధతిని రష్యన్ శాస్తవ్రేత్తలు నిరూపించారు. వేర్వేరు రోగాలకు వేర్వేరు రంగుటద్దాల ద్వా రా సూర్యకాంతిని ప్రసరింపజేసి అనారోగ్యాలను నివారింపచేసే కలర్ థెరపీ ప్రసిద్ధి చెందుతోంది. రవికి సంబంధించిన ధాన్యం, గో ధుమలు, గోధుమ పాలు, గోధుమ గడ్డి రసం పలువిధాలైన అనారోగ్యాలను నివారిస్తున్నట్టుగా శాస్తవ్రేత్తలు వక్కాణించారు. జ్యో తిశ్వాస్త్ర రీత్యా పగడం రవికి చెందిన అల్పమూల్య రత్నం. ఇలా రవి లక్షణాలు గల పదార్ధా లు రవి ప్రభావం వలన జనించిన రోగాలన్నీ నయం చేస్తున్నాయి.ఇంకా ఉంది