News and Entertainment

ఈ రోజు రాత్రికి ఆకాశంలో అద్బుతం.. ఎర్రగా చంద్రుడి దర్శనం


అక్టోబర్ 16 ఆదివారంపున్నమి కాంతులు వెదజల్లే రోజు. అంతేకాదు ఆ రోజు ప్రతి నెలా పున్నమి రోజు కనిపించే దానికంటే పెద్దగా కనిపిస్తాడు చంద్రుడు. ఈ పున్నమిని శరత్ పున్నమి అంటారు.
శరదృతువులో వచ్చే పున్నమి అంటే కవులకు ఎంతగానో ఇష్టం. తెలుగు సాహిత్యంలో శరత్ పున్నమికి ప్రత్యేక స్థానముంది. ఎన్నో వర్ణనలుకావ్యకన్యకలు పుట్టుకు వచ్చాయి.

ఇదిలా ఉంటే.. ఆదివారం నాటి పున్నమికి మరో స్పెషాలిటీ కూడా ఉంది. సూపర్ బ్లడ్ మూన్ దర్శనమివ్వనుంది. ఆకాశంలో అరుదుగా కనిపించే దృశ్యమిది. అంటే ఎరుపు రంగులో చంద్రుడు దర్శనమివ్వనున్నాడు.

తన కక్ష్యలో భూమికి దగ్గరగా రావడం వల్ల ఇలా కనిపిస్తాడు చంద్రుడు. సూర్యకాంతి చంద్రుడిపై పడుతూ ఉండడంతో అప్పుడు జాబిల్లి నారింజరంగులో మెరిసిపోతూ అబ్బురంగా కనిపించనుంది. అందుకే శాస్త్రజ్ఞులు బ్లడ్ మూన్ అంటున్నారు. గతేడాది సెప్టెంబర్ లోనూ ఇలాగే కనువిందు చేశాడు. సో మీరు కూడా రెడీ అవ్వండి చూడటానికి.