News and Entertainment

1 రూపాయికే అన్ లిమిటెడ్ 4 జి డాటా...ఐడియా సంచలన ఆఫర్


రిలయన్స్ జియో పేరుతో టెలికాం రంగంలో సృష్టించిన హడావుడి అంటా ఇంతా కాదు. మూడు నెలల పాటు ఉచిత 4 జి డాటా, వాయిస్ కాల్స్ ఉచితం అనే  ఆఫర్లతో వినియోగదారులను తన వైపు తిప్పుకోవడంలో సఫలీకృతమయ్యారు. ఈ దెబ్బతో మిగతా కంపెనీలు కూడా ఒక మెట్టు దిగివచ్చి ఎన్నో సరికొత్త ఆఫర్లను ప్రవేశపెడుతున్నాయి. రిలయన్స్ జియో 2016 సెప్టెంబర్ నుంచి 2016 డిసెంబర్ వరకు ఈ ఆఫర్ ను ప్రవేసపెట్టింది. అయితే మరొక ప్రముఖ సంస్థ ఐడియా మిగతా కంపెనీలకు విభిన్నంగా సరికొత్త ఆఫర్ ను ప్రవేశపెట్టింది. తమ డాటా ప్లాన్లపై 67 శాతం చార్జీలను తగ్గించి సంచలనం సృష్టించింది. గతంలో ఐడియా తన వినియోగదారులకు 10 జిబి  డాటా ను రూ 990 రూపాయలకు,3 జిబి డాటాను రూ 649 లకు, 2 జిబి డాటాను రూ 349 రూపాయలకు అందించేది.


అయితే రిలయన్స్ జియో ఒక్కసారిగా ఉచిత ఆఫర్ ప్రవేశపెట్టడంతో మిగతా కంపీనలతో పాటు ఐదియాపై కూడా తీవ్ర ప్రభావం చూపించింది. అయితే ఈ పోటీను తట్టుకునేందుకు ఐడియా సరికొత్త ఆఫర్ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్లో భాగంగా అన్ లిమిటెడ్ 4 జి డాటాను కేవలం 1 రూపాయకే అందిస్తోంది. ఇది వినియోగదారులకు శుభసూచకమే. అయితే ఈ డాటాను కేవలం ఒక గంట లోనే పొందాల్సి ఉంటుంది. ఒక గంటలో 7 జిబి డాటా వరకు ఉపయోగించుకోవచ్చు. మరింకెందుకాలస్యం మీకు కావాల్సిందల్లా 4 జి సిం కార్డ్, 4 జి స్మార్ట్ ఫోన్. మీరు ఐడియా నంబర్ తో 411 కు డయల్ చేస్తే మీ బ్యాలన్స్ నుంచి 1 రూపాయి పోయి మీకు 4 జి డాటా అందుబాటులో ఉన్నట్టు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. వెంటనే ఒక గంట పాటు అన్ లిమిటెడ్ దాటాను ఉపయోగించుకోవచ్చు.