News and Entertainment

ఇజం మూవీ రివ్యూ

 

సినిమా: ఇజం
రేటింగ్‌: 3.5/5
బ్యానర్‌: ఎన్.టి.ఆర్. ఆర్ట్స్
తారాగణం: నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి శౌర్య రామ్, అదితి ఆర్య, జగపతి బాబు, తనికెళ్ళ భరణి, గొల్లపూడి మారుతి రావు, అలీ, పోసాని కృష్ణ మురళి, జయప్రకాష్ రెడ్డి, ఈశ్వరి రావు, అజయ్ ఘోష్, వెన్నెల కిషోర్ తదితరులు
కథ: పూరి జగన్నాధ్
సంగీతం: అనూప్ రూబెన్స్
కూర్పు: జునైద్ సిద్దిక్వి
ఛాయాగ్రహణం: జి ముకేశ్
నిర్మాత: నందమూరి కళ్యాణ్ రామ్
దర్శకత్వం: పూరి జగన్నాధ్
విడుదల తేదీ: అక్టోబరు 21, 2016

నందమూరి కళ్యాణ్ రామ్, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇజంఈరోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచ వ్యాప్తంగా 750 థియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రం నందమూరి అభిమానులకి మంచి కిక్ ఇవ్వనుంది. పటాస్ తో మంచి విజయాన్ని అందుకున్న కళ్యాణ్ రామ్ మరో డిఫరెంట్ లుక్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పూరి జగన్నాధ్ కళ్యాణ్ రామ్ లుక్స్, బాడీ లాంగ్వేజ్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్లకు విశేష స్పందన రావడం జరిగింది. ఫస్ట్ లుక్ లో కళ్యాణ్ రామ్ 6 ప్యాక్ లో కనపడడం జరిగింది. సమాజంలో పెరిగిపోతున్న అవినీతి, నల్లధనం ప్రధానాంశాలుగా చేసుకొని వికీలీక్స్అసాంజ్ స్ఫూర్తితో హీరో క్యారెక్టర్ ను రాసుకున్నారు పూరి. అవినీతిని నిర్ములించాలనే మెసేజ్‌ను ఆధారంగా చేసుకుని దానికి తన స్టయిల్లో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ను జోడించి సినిమా తీసిన దర్శకుడు పూరి,కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను ఎలా అలరించిందో తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.

కధ:
వృత్తి రీత్యా జర్నలిస్ట్ అయిన సత్య మార్తాండ్ (కళ్యాణ్ రామ్), జావేద్ భాయ్ (జగపతి బాబు) లు మంచి స్నేహితులు. వ్యవస్థలో రోజు రోజుకి పెరిగిపోతున్న అవినీతిని కారణంగా సత్య తన జీవితంలో కొన్ని నష్టపోతాడు. దింతో తట్టుకోలేకపోయిన సత్య అవినీతిపై యుద్ధం చేసేందుకు నిర్ణయించుకుంటాడు. అవినీతిపై యుద్ధం చేయడానికి ప్రజలకి ఓ ధైర్యం కావాలని, ఆ ధైర్యానికి రూపం అవసరం లేదనుకున్న సత్య మాస్క్ ధరించి అవినీతిపై పోరాడాలనుకుంటాడు. చట్టాలు, న్యాయ వవస్థల ద్వారా న్యాయం జరగని ప్రతి సందర్భంలో సత్యలోని రెండో షేడ్ (మాస్క్ మెన్) ద్వారా న్యాయం చేస్తుంటాడు. అదే సమయంలో అలియా ఖాన్ (అదితి ఆర్య) తో పరిచయం, ఆ పరిచయం కొద్ది రోజులకే ప్రేమగా మారుతుంది. తన ప్రియురాలితో కూడా సత్య తన గూర్చి, తన గతం గురించి చెప్పకూడదు అనుకుంటాడు.. అందరికి ఓ సాధారణ జర్నలిస్టుగా కనపడుతూ తనపై ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా, తనలోని రెండో షేడ్ ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడతాడు. అలా అవినీతి, నల్లధనం పై పోరాటం చేస్తున్న సత్యకి ఓరోజు తన స్నేహితుడు జావేద్ భాయ్ నే వీటన్నింటికి కారణం అని తెలుసుకుంటాడు. తాను ప్రేమిస్తున్న అలియా కూడా జావేద్ భాయ్ కూతురని తెలిసి షాక్ అవుతాడు. అప్పుడేం జరుగుతుంది? అస్సలు సత్య జీవితంలో ఏం జరిగింది.. సత్య ఎందుకు అవినీతిపై పొరాడాలనుకుంటాడు? తాను ప్రేమించిన అమ్మాయి జావేద్ కూతురు అని తెలుసుకున్నసత్య ఏం చేస్తాడు? సత్య తన స్నేహితుడు జావేద్ ని చట్టానికి పట్టిస్తాడా? లేదా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

సమీక్షా:
ఇజంలో మనకు ముఖ్యంగా కనపడేవి రెండు పాత్రలే. ఒకటి కళ్యాణ్ రామ్ పాత్ర కాగా, మరొకటి జగపతి బాబు పాత్ర.. సినిమా అంతటినీ వీరిద్దరే నడిపించారు. పూరి తాను రాసుకున్న కథని చక్కగా స్క్రీన్ మీద ప్రెసెంట్ చేయగలిగారు. కధలో ఎక్కడ డీవియేషన్ లేదు. పటాస్ తో ఫుల్ జోష్ లో ఉన్న కళ్యాణ్ రామ్ ఈ సినిమా కోసం మరింత కష్టపడ్డారు. 6 ప్యాక్, కొత్త హెయిర్ స్టైల్స్ తో కళ్యాణ్ రామ్ స్క్రీన్ పై అదరగొట్టేసాడు. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ ఫైట్స్‌, డ్యాన్సుల పరంగానే కాకుండా ఎమోషనల్‌ సీన్స్ లో మంచి నటనను కానపరిచారు. ఇక జగపతి బాబు పాత్ర విషయానికి వస్తే జావీద్ భాయ్ వంటి పవర్‌ఫుల్‌ పాత్రలో తనదైన నటనను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. హీరోయిన్ అదితి ఆర్య పాత్ర నిడివి మరి చిన్నదిగా ఉన్నప్పటికీ హీరో, హీరోయిన్ ల మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు, పాటలు బాగున్నాయి. సినిమా సెకండాఫ్‌లో కొంత లెగ్ కనిపించినప్పటికీ దర్శకుడు తన దర్శకత్వ ప్రతిభతో దాన్ని కవర్ చేసేసారు. కళ్యాణ్ రామ్ చిన్నప్పటి పాత్రలో ఆయన తనయుడు నందమూరి శౌర్య రామ్ నటించారు. సౌర్య కి ఇది మొదటి సినిమా అయినప్పటికీ మంచి నటనని కనబరిచాడు. తనికెళ్ళ భరణి, గొల్లపూడి మారుతి రావు, అలీ, పోసాని కృష్ణ మురళి, జయప్రకాష్ రెడ్డి, ఈశ్వరి రావు, అజయ్ ఘోష్, వెన్నెల కిషోర్ తదితరులు వారి పాత్రలు మేర చక్కగా న్యాయం చేశారు. అనూప్ రూబెన్స్ సంగీతం, ముకేశ్ ఛాయాగ్రహణం ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. అయితే బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ లో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సింది. క్లైమాక్స్ లో వచ్చే కోర్టు సన్నివేశాలు బాగున్నాయి. ఎప్పుడు తన చిత్రాల ద్వారా ఎదో ఓ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పరితపించే దర్శకుడు పూరి జగన్నాధ్ ఈసారి అవినీతి, నల్లధనం ప్రభావం ఆర్థిక వ్యవస్థ పై ఈ విధమైన ప్రభావం చూపుతుందో తనదైన శైలిలో చూపించారు.

ఇజం ప్లస్ పాయింట్స్:
స్టోరీ లైన్, డైలాగ్స్
కళ్యాణ్ రామ్ నటన
జగపతి బాబు, కళ్యాణ్ రామ్ పై చిత్రీకరించిన సన్నివేశాలు
సినిమా ఫస్ట్ హాఫ్
కోర్టు సీన్

ఇజం మైనస్ పాయింట్స్
సెకండ్ హాఫ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్

బోటమ్ లైన్: ఇజం’.. అవినీతిపై పోరాటం

రేటింగ్: 3.5/5