News and Entertainment

జపాన్ ను పట్టి పీడిస్తున్న సెక్స్ సమస్య


అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్న జపాన్‌ను ఒక తీవ్రమైన సమస్య పట్టి పీడిస్తోంది. యువత శృంగారం పట్ల విముఖత చూపడం ఆ దేశానికి శాపంగా మారింది. రోజురోజుకూ జపాన్‌లో చనిపోతున్న వారి సంఖ్యతో పోల్చుకుంటే జననాల సంఖ్య సగం కూడా ఉండడం లేదట. పైగా ప్రస్తుత జపనీయుల్లో మూడో వంతు 65 సంవత్సరాలు దాటిన వారేనట. ఈ విషయాలను జపాన్‌ సెన్సస్‌ బ్యూరో ఇటీవల విడుదల చేసింది. జపాన్‌ యువత సంవత్సరానికి కేవలం 45 పర్యాయాలు మాత్రమే శృంగారాన్ని ఆస్వాదిస్తున్నట్టు ఇటీవల ఓ సర్వే వెల్లడించింది. 

ఆ దేశ దంపతులు సంవత్సరానికి 17 సార్లు మాత్రమే శృంగారంలో పాల్గొంటున్నారట. ఇక జపాన్‌లో చాలా మంది తమవి సెక్స్‌ లెస్‌ మేరేజెస్‌అని ఓ సర్వేలో చెప్పారట. అంటే ఆ దంపతులు ఒకే ఇంట్లో ఉంటారు గానీ, వారి మధ్య శారీరక సాన్నిహిత్యం ఉండదట. అక్కడి మహిళలతో పోలిస్తే.. పురుషులు శృంగారంలో కొద్దిగా యాక్టివ్‌గా ఉంటారట. అయితే తమ భార్యలతో కాకుండా కాల్‌గాళ్స్‌తో కండోమ్‌ వాడి శారీరక వాంఛలను తీర్చుకోవడానికే ఎక్కువ ఇష్టపడతారట.