News and Entertainment

జియో క‌స్ట‌మ‌ర్ల‌కు వార్నింగ్‌.. ఆ మెస్సేజ్‌కి రిప్లై ఇవ్వండి.. లేదంటే సిమ్ డీయాక్టివేట్‌..!


రిల‌య‌న్స్ జియో బంప‌ర్ ఆఫ‌ర్ ఎంజాయ్ చేస్తున్నారా..? డిసెంబ‌ర్ వ‌ర‌కు ఇచ్చిన వెల్క‌మ్ ఆఫ‌ర్‌తో ఫుల్ ఖుషీగా ఉన్నారా..? ఫ్రీ ఇంట‌ర్నెట్‌ని ఎంజాయ్ చేస్తున్నారా..? అయితే, మీకు ఓ షాకింగ్ న్యూస్‌.. మీ సిమ్ డీయాక్టివేట్ అయ్యే చాన్స్ ఉంది. అలా కాకుండా ఉండాలంటే మీరు కాస్త యాక్టివ్‌గా ఉండ‌క త‌ప్ప‌దంటున్నారు మార్కెట్ నిపుణులు.


ఇంత‌కీ ఏం చెయ్యాలంటారా..? మీరు చెయ్యాల్సింది అంతా ఒక్క‌టే.. జియో సిమ్ వాడుతున్న క‌స్ట‌మ‌ర్ల ఇన్‌బాక్సాస్‌కు ఓ వెరిఫికేష‌న్ మెస్సేజ్ వ‌స్తుంది. ఆ మెస్సేజ్‌కి త‌గిన వివ‌రాల‌ను వెంట‌నే మీరు రిప్లై ఇవ్వాలి. లేదంటే మీ జియో సేవ‌లు త‌క్ష‌ణం నిలిపివేయ బ‌డ‌తాయ‌ట‌. లేదంటే, మీ సేవ‌లు య‌థాత‌థంగా కొన‌సాగాలంటే ద‌గ్గ‌ర్లోని రిల‌య‌న్స్ షోరూమ్‌కి వెళ్లి ఫింగర్ ప్రింట్ వేయాల‌నేది ఈ మెస్సేజ్ సారాంశం. మెస్సేజ్ వ‌చ్చిన త‌ర్వాత కూడా ఏముందిలే అని లైట్ తీసుకుంటే.. రిల‌య‌న్స్ జియో సేవలు ఆటోమేటిక్‌గా క‌ట్ అయిపోతాయ‌ట‌. దీంతో, ఫ్రీ ఇంట‌ర్నెట్ ఆఫ‌ర్ చాన్స్ మిస్ అవ‌డం ఖాయ‌మ‌ట‌. అందుకే అశ్ర‌ద్ధ లేకుండా కాస్త జాగ్రత్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రిస్తున్నారు మార్కెట్ నిపుణులు.