News and Entertainment

రాజీవ్ గాంధీ హత్యకు కారణం కేవలం రూ 200..!




మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 1991 వ సంవత్సరంలో హత్య గావించబడిన విషయం ప్రేక్షకులకు విదితమే. తీవ్ర వాడ సంస్థ ఎల్ టి టి ఐ జరిపిన ఆత్మాహుతి దాడిలో ఆయన మరణించారు. తమిళనాడు లోని పెరుమ్బుదూర్ లో ఎన్నికల సభలో ఆయనను మానవబాంబు తో హత్య గావించారు. ఈ హత్యకు సంబందించిన నిందితులు ఇప్పటికీ శిక్షను అనుభవిస్తున్నారు. అయితే ఈ హత్యకు సంబంధించి ఒక ఆసక్తికర నిజం వెలుగులోకి వచ్చింది.


కేవలం రూ.200 లంచానికి ఆశపడ్డ ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ నిర్వాకం వల్ల ఎల్‌టీటీఈ ఆత్మాహుతి దళం జరిపిన దాడిలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ మరణించారనిహైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి చంద్రకుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏళ్ల తరబడి పేరుకు పోయిన అవినీతిని కూకటి వేళ్లతో పెకిలిస్తేనే ఫలితాలు ఉంటాయని జాతీయ అవినీతి నిర్మూలన కౌన్సిల్‌ ఆదివారం నిర్వహించిన సదస్సులో ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న నిందితురాలు నళిని తన విడుదలపై చొరవ  తీసుకోవాలని జాతీయ మహిళా కమీషన్ కు లేఖ రాసింది.