News and Entertainment

డేటాను మరింత సేవ్‌ చేసే ఎఫ్‌‌బీ కొత్త మెసెంజర్...!



సోషల్‌ మీడియా యాప్స్‌కు సంబంధించిన అప్‌డేట్‌ ఏం జరిగినా దాంట్లో మొబైల్‌ డాటా ఎంత సేవ్‌ చేయగలమనేది ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. అలాంటి వారి కోసం తాజాగా ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ అప్‌డేట్‌ వచ్చింది.కొత్తగా విడుదల చేసిన 93.0.0.9.69 బీటా వర్షన్‌లో డాటా సేవ్‌ ఆప్షన్‌ ఇచ్చారు. ఎవరైనా మిత్రుడు మీడియా ఫైల్‌ మెసెంజర్‌ ద్వారా పంపితే గతంలో ఆటోమేటిగ్గా డౌన్‌లోడ్‌ అయ్యేది.. తాజా అప్‌డేట్‌ వల్ల కావాలనుకున్నవాటినే ఎంచుకుని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.


దీన్ని యాక్టివేట్‌ చేసుకోవాలంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి డాటా సేవర్‌ క్లిక్‌ చేసి తరవాతి ట్యాబ్‌లో ఎనేబుల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫీచర్‌ మొబైల్‌ డాటాపై మాత్రమే పనిచేస్తుంది. ప్రస్తుతం బీటా టెస్టింగ్‌ దశలో ఇది అందుబాటులోకి వచ్చింది. త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఇప్పుడే ఈ వర్షన్‌ ప్రయత్నించాలనుకుంటే బీటా టెస్టర్‌గా ఎనేబుల్‌ అవ్వాలి.. లేదా ఏపీకే మిర్రర్‌ వంటి సైట్ల నుంచి నేరుగా ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు.