News and Entertainment

8గంII సెక్స్ వీడియోలు చూపించి మ‌రీ మోనిక‌పై రేప్‌ చేశాడు


ప్ర‌స్తుతం సంచ‌ల‌నంగా మారిన‌ గోవ పెర్ఫ్యూమ‌ర్ మోనిక ఘ‌ర్డే హ‌త్య కేసులో ఊహించ‌ని నిజాలు వెలుగు చూస్తున్నాయి. అనుమానిత నిందితుడిని ప్ర‌శ్నించిన పోలీసుల‌కు న‌మ్మ‌స‌క్యం కాని విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. అటు పోలీసుల‌ను, ఇటు జ‌నాన్ని షాక్‌కి గురిచేస్తున్న ఈ హ‌త్య అనుకోకుండా జ‌రిగింది కాద‌ని, ప‌క్కా ప్లాన్ ప్ర‌కార‌మే రాజ్ కుమార్ సింగ్ చేశాడ‌ని పోలీసులు తేల్చి చెప్పేశారు.

                           ఈ క్ర‌మంలో ఈ హ‌త్య‌కు సంబందించిన కొన్ని వివ‌రాల‌ను మీడియాకు అందించారు. వివ‌రాల ప్రకారం, మోనిక ఘ‌ర్డే నివ‌సిస్తున్న అపార్ట్‌మెంట్‌లో ఏమైన ఖాళీ ప్లాట్స్ ఉన్నాయా అని అడిగేందుకు వ‌చ్చిన రాజ్‌కుమార్ సింగ్‌, ఆమెతో మాట్లాడిన త‌ర్వాత మోనిక పట్ల ఆక‌ర్షితుడ‌య్యాడు. ఆమెను ఎలాగైనా ద‌క్కించుకోవాల‌నే ఆశ‌తో అమెకు సంబందించిన వివ‌రాలు తెలుసుకుంటూ, త‌న ఒక్క‌ర్తే ఉంటుంద‌న్న సంగ‌తి తెలుసుకున్నాడు. ఆమెతో ప‌రిచ‌యం పెంచుకునే ఉద్దేశంతో ఆమె కార్ స‌ర్విసింగ్‌కు సంబందించిన భాధ్య‌తలు తీసుకున్న‌ట్లుగా తెలుస్తుంది. అప్ప‌ట్నుండి ఆమెతో మాట‌లు పెంచిన రాజ్‌కుమార్‌. త‌న ఫ్లాట్ తాలూకు ప్ర‌తీ వివ‌రాలు తెలుసుకున్నాడు. అయితే రాజ్‌కుమార్ ప‌ద్ద‌తి బాగోక‌పోవ‌టంతో కంప్లైంట్ ఇవ్వ‌టంతో అపార్ట్‌మెంట్‌లో త‌న ఉద్యోగం పోయింది.


ఇది మ‌న‌సులో పెట్టుకున్న రాజ‌కుమార్ సింగ్ ప‌క్కా ప్లాన్‌తో అక్టోబర్ 5వ తేదీ సాయంత్రం 6.30 గంటల సమయంలో ఘర్డే ఫ్లాట్‌లోకి బలవంతంగా ప్రవేశించాడని, ఆమె సాయం కోరుతూ గట్టిగా అరుస్తుండగానే అతడు ఆమె నోరు నొక్కేసి, కత్తితో బెదిరించాడు. ఆమెను బ‌ల‌వంతంగా బాత్రూమ్‌కి లాకుని పోయి ఆమె అర‌వ‌కుండా నోటిలో గుడ్డ‌లు కుక్కేశాడు. ఆమె అప్ప‌టికే బెదిరిపోయి స్ర్పుహ కోల్పోయే స్థితిలో ఉండ‌గా, ఆమెను బెడ్ రూమ్‌కు తీసుకువ‌చ్చి, ఆమె చేతులు కాళ్ల‌ను క‌ట్టేసి డ‌బ్బు ఇమ్మ‌ని బెదిరించాడు. ప‌ర్సులో నాలుగు వేలు ఉన్నాయ‌ని చెప్ప‌టంతో అవితీసుకుని, ఇంకా కావాల‌ని డిమాండ్ చేశాడు. ఎ.టి.ఎమ్ కార్డ్స్ ఇచ్చి పిన్ నెంబ‌ర్ చెప్ప‌టంతో కాస్త శాంతించిన రాజ్‌కుమార్‌, ఆమె ఫోన్ తీసుకుని, నెట్ ద్వారా మూడు సెక్స్ వీడియోలు ఓపెన్ చేసి ఆమెకు బ‌ల‌వంతంగా చూపించాడు. అంత‌టితో ఆగ‌కుండా ఆమె ఒంటిపై ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ క‌రిచి పంటితో గాయాలు చేయ‌ట‌మే కాకుండా, ఆమెపై అతి దారుణంగా అత్యాచారం జ‌రిపాడు. 8 గంట‌ల పాటు ప్ర‌త్య‌క్ష న‌ర‌కం చూపించిన రాజ్‌కుమార్ సింగ్‌, మోనిక త‌న విష‌యం పోలీసుల‌కు చెప్పేస్తుంద‌న్న భ‌యంతో పీక‌పిసికి చంపేశాడు.